ఆదర్శప్రాయం….అట్లూరు రాధాక్రిష్ణ జీవితం..
91 ఏళ్ల వయస్సులో యంగ్ బాయ్ లా వర్క్..
– ఇప్పటికి నెల సంపాదన 30 వేలు..
– ఆయన కుటుంబం 140 మంది సభ్యులు..
– సొంతంగా పనులు చేసుకోవడమే ఆరోగ్య రహస్యం..
-సొంత డబ్బులతోనే అంత్యక్రియలు చేయాలని..
– ప్రేమలు పెంచుకుంటే అప్పుడప్పుడు బాధ పడాల్సిందే..
(యాటకర్ల మల్లేష్)
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఇది అక్షరాల 91 ఏళ్ల అట్లూరి రాధాక్రిష్ణ సొంతం.. ఆయననతో ముచ్చట పెడితే గోదావరి నదిలా గళ గళ మాట్లాడుతుంటారు. జీవితంలో ఎదురైన మంచి – చెడులను మరిచి పోకుండా చెబుతారు ఆయన. ఎక్కువగా చదువుకోక పోయినా.. సమాజంపై అవగహన ఉంది. ఆయన కుటుంబ సభ్యులు 140 మంది.. ఇప్పటికే తొమ్మిది మంది మనుమలను.. మరో తొమ్మిది మంది ముని మనుమలను చూశానని సంతోషంతో చెబుతాడు అల్లూరి రాధాక్రిష్ణ. అన్యాయంగా ఒకరి నుంచి రూపాయి ఆశించకుండా, జాలీగా బతుకడంతోనే ఇంకా ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో గల తన మనుమడు సుధాకర్ రోడ్ ప్రమాదానికి గురయ్యారని తెలిసి రాజమండ్రి నుంచి బస్సు ఎక్కి ఒక్కరే పలుకరించడానికి విచ్చేసిన సందర్భంగా ‘‘నిర్దేశం’’ ఆయనను పలుకరించింది. ఆయన మాటల్లోనే..
అట్లూరి రాధాక్రిష్ణ జీవిత ప్రస్థానం..
నేను పుట్టి పెరిగింది క్రిష్ణ జిల్లా కైకలూరు సమీపంలోని సీతనపల్లి గ్రామం. ఇప్పుడు నా వయసు 91 ఏళ్లు. మా నాన్న అట్లూరి అంజయ్య, అమ్మ నాగరత్నమ్మ. మేము ఆరుగురం అన్నదమ్ములం కుటుంబరావు, రామబ్రహ్మం, రాధాక్రిష్ణ, వీర రాఘవయ్య, శేషగిరి రావు, వెంకటేశ్వర్లు. ఇప్పటికే ఇందులో నుంచి కుటుంబ రావు, శేషగిరిరావు, వెంకటేశ్వరరావు ముగ్గురు మరణించారు. నా కష్ట సుఖాలలో కలిసి ఉండే నా భార్య శేషారత్నం ఆనారోగ్యంతో మరణించి ఎనిమిదేళ్లు అవుతుంది. నాకు నలుగురు పిల్లలు, పెద్ద కుమారుడు ప్రసాద్ కు 70 ఏళ్లుంటాయి. ఆ తరువాత కోటేశ్వరరావు 45 ఏళ్లకే మరణించారు. అప్పుడు చాలా బాధ పడ్డాను. మూడో సంతానంలో అమ్మాయి పద్మ. చివరిగా పూర్ణచందర్ రావు. మేము ఆరుగురం అన్నదమ్ములం.. మా కుటుంబం 140 మంది, నా కుటుంబమే 34 మంది. ఇప్పటికే తొమ్మిది మంది మనుమలు, మనుమరాళ్లు, మరో తొమ్మిది మంది ముని మనుమలు, మనుమరాళ్లను చూసిన సంతోషం ఉంటుంది.
ఆరోగ్య రహాస్యం..
ఆరోగ్యంను మించింది ఏమి లేదు. చిన్నప్పుడు వ్యవసాయం పనులు చేసిన. మా అమ్మ నాకు నెయ్యితో మంచి బోజనం పెట్టేది. ఇప్పటికే నెయ్యి లేకుండా బుక్క లోనికి వెళ్లదు. దీనికి తోడు హార్డ్ వర్క్ చేస్తా.. ముఖ్యంగా ఒక్క రూపాయి ఇతరులది ఆశించను. మనం డబ్బుల వెంట పడితే ఆరోగ్యం మన వెంట పడి చావుకు దగ్గరగా తీసుకెళులుంది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించాలి. నాకు ఇప్పటికీ బీపీ, షుగర్ లేదు. నా ముందు చాలా మంది డబ్బుల కోసం మోసాలు చేసినోళ్లకు బీపీ, షుగర్, పక్షవాతం వచ్చి బాధపడుతున్నారు. ప్రతి రోజు పొద్దున నాలుగు గంటలకు లేస్తాను. ఎక్సర్ సైజ్ చేస్తాను. జాలీగా ఉంటాను. నో టెన్షన్.. హెల్త్ ముఖ్యం కదా.. నేను మరో రెండేళ్లు తప్పకుండా బతుకుతాను. నా భార్య శేషరత్నం ఆనారోగ్యంతో మరణించినప్పుడు ఈ జనసంచారంకు దూరంగా బతుకుదాం అనుకున్నాను. నేను ఒక్కరికి భారం కావద్దానుకున్న. నా వాళ్లకు తెలియకుండా ఆనాధ ఆశ్రమంలో తుది శ్వాష వదిలే వరకు ఉండాలని అనుకున్న. కానీ.. నేను ఇది వరకు చేసిన కంపెనీ వాళ్లు వచ్చి నన్ను పోలవరం వద్ద గల వాళ్ల కంపెనీ వద్ద ఇన్ చార్జీగా ఉంచారు. నాకు సహాయకుడిగా దుర్గా ప్రసాద్ (మెకానిక్ ఫోన్ మెన్)ను ఉంచారు. మేమిద్దం అక్కడే ఉంటాం. కల్తీలేని కూరగాయలు వంట చేసుకుని అక్కడే ఉంటున్నాం. నాకు ఇప్పటికే నెలకు 30 వేల జీతం ఇస్తోంది కంపెనీ.
ప్రేమలు పెంచుకుంటే బాధ పడాల్సిందే..
నా కుటుంబమంటే ప్రేమ. ఆ ప్రేమలు పెంచుకుంటే ఈ వృద్దాప్యంలో బ్యాడ్ న్యూస్ విని బాధ పడాల్సి వస్తోంది. అందుకే ఎవరి మీద ప్రేమలు పెంచుకోవడం లేదు. ఇప్పటికే నా సంపాదనలో చాలా బాగం నా కుమారుడులకు ఇచ్చాను. ఇప్పుడు నా మనుమరాళ్లు, మనుమలకు వారి భవిష్యత్ కోసం ఇస్తున్నాను. (అక్కడే ఉన్న రాధాక్రిష్ణ మనుమరాళు భార్గవి మాట్లాడుతూ తాతయ్య అంత్యక్రియలకు మేము ఎవరం డబ్బులు ఖర్చు చేయవద్దని డబ్బులు దాచి పెట్టుకున్నారు. నా బిడ్డ పెళ్లికి బతికి ఉండానని యాభై వేలు ఇచ్చి పెళ్లిలో తాత పేరుతో కట్నం ఇవ్వాలట.. అని చెబుతుంది.) ఇంతకు నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ తెలుచుకుని ఏమి చేస్తారు అని ‘‘నిర్దేశం’’ను నవ్వుతూ ప్రశ్నించారు అట్లూరి రాధాక్రిష్ణ..