ఎంపీకి మతి ఉందో లేదో అర్థం కావడం లేదు
నల్గొండ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ లో తన కుమారుడు చెరుకు సుహాస్ తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంపై స్పందించిన చెరుకు సుధాకర్. బోనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచిత్రమైన అసభ్య పదజాలం ఉపయోగించి నా కొడుకుకు ఫోన్ చేసి నన్ను తిట్టడం నాకు ఆశ్చర్యం కలిగించిందన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్. ఆయన మాటల్లోనే..
తాను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా అతను స్టార్ క్యాంపెనర్ గా ఉండి ఒకే పార్టీలో పని చేస్తున్న తనపై ఆ భాష ఏమిటో అర్థం కావట్లేదు.
ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండో మతి లేక మాట్లాడుతుండు అర్థం కావట్లేదు దీనిని నేను సీరియస్ గా తీసుకుంటాను.
తాను వ్యక్తిగతంగా ఎవరిని కామెంట్ చేయలేదు
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసభ్య పదజాలంతో తనను తిట్టిన ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థక్రే, పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫార్వర్డ్ చేశా.
ఇలాంటి వాళ్ల పెత్తనం పార్టీలో ఎన్ని రోజులు కొనసాగుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నన్ను అసభ్య పదజాలంతో తిట్టిన ఆడియో తెలంగాణ రాజకీయాలలో తీవ్రమైన అంతర్మాదనానికి చర్చకు దారితీస్తుంది.
నేను రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భాలలో కాంగ్రెస్ పార్టీని పరిరక్షించుకుంటానికి మాట్లాడుకున్నాము.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవు.
ఆయనపై నేను వ్యక్తిగతంగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే 100% నేను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పెట్టే స్వేచ్ఛ ఆయనకు ఉంది.
నయీమ్ లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే నన్ను ఏమి చేయలేక పోయిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తాడు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దృష్టిలో తెలంగాణ ప్రజల దృష్టిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి డక్ ఔట్ అయిన వికెట్.