హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలి
హైదరాబాద్, నిర్దేశం :
హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఎమ్మెల్సీ కోదండరాం, రిటైర్డ్ ఐఆర్ఎస్ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అంబెడ్కర్ మాట్లాడుతూ హైదారాబాద్ రెండో రాజధానిగా చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. మూడో ప్రపంచ యుద్ధంపై చర్చ జరుగుతుందని… పాకిస్థాన్, చైనా మనకు సరిహద్దు శత్రువులని ఢిల్లీకి సమీపంలో ఉన్నాయని అన్నారు. రాజధానిని ఢిల్లీ నుంచి సౌత్ ఇండియా కి మార్చాలని పేర్కొన్నారు. హైదరాబాద్ కి అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. దేశానికి రెండో రాజధాని చేయాలని సూచించారు. చిన్న రాష్ట్రాలుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు… డిలిమిటేషన్ వల్ల నష్టపోతామని భావిస్తున్నాయని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లిని రాజధాని ఉంచడం కష్టమైన పని అని… పాకిస్థాన్ కు దగ్గర్లో ఉండటం వల్ల ఇబ్బంది అవుతుందని తెలిపారు.