వికారాబాద్, నిర్ధేశం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో విషాదం జరిగింది. నేనావత్ దేవేందర్ (16) అనే పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. బుధవారం రాత్రి పడుకున్న విద్యార్థి తెల్లారైనా లేవకపోవడంతో హాస్టల్ సిబ్బంది పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటల ముందే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. వసతి గృహంలో ఏదో జరిగిందని విద్యార్థి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.