యోగా గురువు లక్ష్మారెడ్డికి సన్మానం
నిర్దేశం, హైదరాబాద్ :
యోగా… ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలని యోగాను ఉచితంగా నేర్పించేవారున్నారు. ఇగో,..,. మీర్ పేట్ కు చెందిన యోగా గురువు లక్ష్మారెడ్డి 20 ఏళ్లుగా ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారని భావించిన ఆయన శిష్యులు యోగా గురువు లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించారు. సర్వరోగ నివారిణియైన యోగాను తప్పకుండా చేయాలని బాబా రాందేవ్ బాబా చెప్పే ఉపన్యాసాలకు స్పందించి చాలా మంది లక్ష్మారెడ్డి వద్ద ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యోగ కార్యక్రమాలలో రోజు గంట నుంచి రెండు గంటలు యోగ ప్రాక్టీస్ చేస్తే అన్ని రోగాలకు దూరంగా ఉండొచ్చన్నారు. బాబా రాందేవ్ ను కలవడం, వారి ఆశీర్వాదం తీసుకోవడంతో తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు.