ఒకేసారి ఇద్దరికి తాళి కట్టాడు..ఎందుకంటే..?
నిర్దేశం, అదిలాబాద్ :
పెళ్లి అంటే నూరేళ్ల పంట.. దంపతులు కావాలంటే పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి వదువుల కొరత తీవ్రంగా ఉంది. పెళ్లిళ్లు కాని ప్రసాద్ లు అడుగడుగున కనిపిస్తారు. కానీ.. ఓ గిరిజన యువకుడు మాత్రం ఒకే పెళ్లి మండపంలో అందరి సమక్షంలో ఇద్దరు అమ్మాయిలకు తాళి కట్టిన పెళ్లి వేడుక చర్చనీయాంశంగా మారింది.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభ బాయ్, బద్రుషావ్ దంపతుల కుమారుడు ఛత్రుషవ్, జైనూర్ మండలం పూనగూడకు చెందిన జంగుబాయి, ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన సోమ్‌దేవిలను ఒకేసారి వివాహమాడాడు. ఇరువురి కుటుంబాల సమ్మతితో అంగరంగ వైభవంగా ఆదివాసీల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు, గ్రామస్థులు యువతుల అభిప్రాయాన్ని కోరగా, వారు సరే అన్నారు. దీంతో పెళ్లి సంబురాలు మొదలయ్యాయి. పెళ్లి కార్డులు కొట్టించారు, ఫ్లెక్సీలు వేయించారు. గురువారం ఇద్దరు అమ్మాయిలతో ఒకే వేదికపై ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం ఛత్రుషవ్ పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకను చూసేందుకు బంధువులతో పాటు స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు.