కశ్మీరీయేతరులపై దాడికి హసీం మూసా ప్లాన్..!
– నిఘా వర్గాల దర్యాప్తులో కీలక సమాచారం..!
(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)
పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తానీ ఉగ్రవాదులు హషీం మూసా అలియాస్ సులేమాన్, అలీభాయ్ ప్రేమం ఉందని నిఘావర్గాల దర్యాప్తులో తేలింది. హషీం ముసా పాకిస్తాన్ ప్రత్యేక దళాల్లో పారా కమాండోగా చేయగా.. ప్రస్తుతం నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో సభ్యుడిగా పని చేస్తున్నాడు. గత సంవత్సరం అక్టోబర్‌లో గందర్బల్, బారాముల్లా దాడుల్లో సైతం అతని హస్తం ఉన్నది. అయితే, డిసెంబర్ నుంచే కశ్మీర్‌లో కశ్మీరీయేతరులపై భారీ దాడికి ప్రణాళిక వేస్తున్నట్లుగా నిఘా సంస్థల విచారణలో గుర్తించింది. మూసాకు పాకిస్తాన్ భద్రతా దళాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) భారత్‌పై దాడులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో పారా కమాండోగా ఉన్న మూసాను లష్కరేలో చేర్చుకున్నది.
2024 అక్టోబర్‌లో గగన్‌గిర్, బారాముల్లాలోని జరిగిన ఉగ్రవాద దాడుల్లో ముసా పాల్గొన్నాడు. ఆ సమయంలో గగన్‌గిర్‌లో ఆరుగురు స్థానికేతరులు, ఓ వైద్యుడిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. బూటాపాత్రిలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇద్దరు ఆర్మీ పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు.ఈ సంఘటనలో పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు జునైద్ అహ్మద్, అర్బాజ్ మీర్ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిద్దరిని గతేడాది నవంబర్, డిసెంబర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు హతమార్చాయి. అప్పటి నుంచి ముసా కశ్మీర్ లోయలో భారీ దాడి చేయాలని ప్రణాళిక రూపొందించాడు. ఓవర్‌గ్రౌండ్ వర్కర్‌ని (OGWs) అంటే పహల్గాం దాడి తర్వాత అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల స్థానిక సహచరులను విచారిస్తున్న సమయంలో ఈ విషయం వెల్లడైంది.
కశ్మీర్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ లాజిస్టిక్స్, నిఘా ఏర్పాఉట చేసి ఉగ్రవాదులకు సహకారం అందించారు. గతంలో మూసా కశ్మీర్‌లో జరిగిన అనేక దాడుల్లో కూడా పాత్ర పోషించాడు. 2024 అక్టోబర్‌లో కశ్మీర్‌లోని గందర్బల్‌లోని గగన్‌గిర్‌లో జరిగిన దాడిలోనూ పాల్గొన్నాడు. దాడుల్లో ఆరుగురు స్థానికేతరులు, ఓ వైద్యుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. బారాముల్లాలోని నిర్వహించిన దాడిలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది, ఇద్దరు ఆర్మీ పోర్టర్లు మరణించారు. ఈ దాడిలో ముసా పాత్ర పోషించాడు.పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయానికి మూసాకి ఉన్న సైనిక సంబంధాలే రుజువని భారత భద్రతా, నిఘా సంస్థలు విశ్వసిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలో పాకిస్తాన్ SSG కమాండో ప్రమేయం వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. వాస్తవానికి ఎస్‌ఎస్‌జీ పారా కమాండోలకు కఠినమైన శిక్ష ఉంటుంది. దాడులకు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటారు. అధునాతన ఆయుధాలను సైతం ఉపయోగించగల సామర్థ్యం ఉంటుంది. మూసాకు పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులైన జునైద్ అహ్మద్ భట్, అర్బాజ్ మీర్ దాడుల్లో పాల్గొన్నారు. కానీ, ఈ ఇద్దరు నవంబర్, డిసెంబర్ 2024లో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మరణించారు. ఈ ఇద్దరు ఉగ్రవాదుల హత్య ముసా కశ్మీర్‌యేతర వ్యక్తులను లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాడు. ఇంటర్నెట్ ఆఫ్ ఖిలాఫత్ అంటే ఐఓకే పేరుతో పనిచేస్తున్న పాకిస్తాన్ సైబర్ సైన్యం, భారత సైన్యంపై సైబర్ దాడి చేయడానికి ప్రయత్నించింది.