పాతబస్తీలో హనుమాన్ జయంతి ర్యాలీ
నిర్దేశం, హైదరాబాద్ః
హైదరాబాద్ పాతబస్తీ హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిపుర డివిజన్ లోని ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డిసిపి స్నేహమేహర హాజరై ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు. యువకులు కాషాయం జెండాలతో జైశ్రీరామ్. జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కన్నుల పండుగగా బైక్ ర్యాలీ ముందుకు సాగింది. ఈ బైక్ ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా సౌత్ జోన్ డిసిపి స్నేహ మేహర నేతృత్వంలో అడుగడుగున సీసీ కెమెరాలతో బైక్ ర్యాలీ కదలికలను పరిశీలిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎండి జావిద్ .ఛత్రినాక ఏసిపి సి.హెచ్ .చంద్రశేఖర్. ఛత్రినాక సీఐ. నాగేంద్ర ప్రసాద్ వర్మ. మొగల్ పుర సీఐ. సి శ్రీను తో పాటు డిఐలు మరియు ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.