27న గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమావేశం

27న గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమావేశం

హైదరాబాద్ నగరం చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో ఈనెల 27న ఉదయం 10 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని, టీ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం, రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. సొసైటీ సర్వసభ్య సమావేశానికి సొసైటీ సభ్యులందరూ హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!