జాతి సెల్యూట్ చేయదగిన మహా మనిషి. ఎందుకంటే..?

 జాతి సెల్యూట్ చేయదగిన మహా మనిషి. ఎందుకంటే..?

ఇది మహానీయుడి కథ… ఇలాంటి కథలు చదువుతుంటే స్పూర్తి పొందుతాం.. ఇగో.. అలాంటి మహానుభావులు నడయాడిన భారత దేశంలో మనం పుట్టడం నిజంగా గర్వకారణం..!

అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి ఊటీ వెళ్లారు.. అక్కడికి వెళ్లాక తెలిసింది, ఫీల్డ్ మార్షల్ శాంమానిక్ షా అక్కడే ఓ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని..!
1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో తను మన ఆర్మీ చీఫ్…!
తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుని నేరుగా వెళ్లారు ..
మానిక్ షా బెడ్ పక్కనే చాలాసేపు కూర్చుని ఆయన ఆరోగ్యస్థితిని కనుక్కున్నారు.. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తిరిగి వెళ్లిపోయే సమయంలో…
“ఇక్కడంతా సౌకర్యంగానే ఉందా..? నేను చేయదగిన సాయం ఏమైనా ఉందా..? అడుగు మిత్రమా..?”అన్నారు కలాం..

“ఓ అసంతృప్తి ఉంది సార్…”అన్నాడు మానిక్ షా..

”ఏమిటది..?” కలాం మొహంలో ఆశ్చర్యం..

“నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి తనకు శెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్…” అన్నాడు కళ్లు తుడుచుకుంటూ..

కలాం కళ్లల్లో కూడా తడి… షా చేయి మీద చేయి వేసి ఆత్మీయంగా నొక్కారు.

”సార్, చిన్న రిక్వెస్టు… ఇరవై ఏళ్లుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు తగిన పెన్షన్ రావడం లేదు..” చెప్పాడు షా.

కలాం ఢిల్లీ వెళ్లగానే చేసిన మొదటిపని… షా పెన్షన్ ఫైల్ తెప్పించుకోవడం.. తగిన ఆదేశాలు జారీచేయడం.. వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రెటరీ ద్వారా 1.25 కోట్ల బకాయిలకు సరిపడా చెక్కును ప్రత్యేక కొరియర్ ద్వారా ఊటీకి పంపించారు..

దటీజ్ కలాం..!

ఇక్కడే చిన్న ట్విస్టు… ఆ డబ్బు మొత్తాన్ని మానిక్ షా ఆర్మీ రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశాడు..!

దటీజ్ షా…!

వావ్… ఎవరు ఎవరికి శెల్యూట్ చేయాలి..?

ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు… జాతి శెల్యూట్ చేయదగిన కేరక్టర్లు..!

దేశానికి , దేశ ప్రజలకు సేవ చేయడమంటే బందిపోట్లులాగా దోచుక తినటం కాదు..!

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించి, వాటిని పాటించి, కాపాడటం..‌!

రేపటి మన దేశ పౌరులు ఇలాంటి వారి నుండి నేర్చుకోవాలి.

– సోషల్ మీడియా

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »