ప్రభుత్వ వైద్య కాళాశాలకు తాళం
నిర్దేశం, మహేశ్వరంః
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు భారత్ కాలేజ్ యాజమాన్యం తాళం వేసింది. కళాశాల అద్దె చెల్లించకపోవడంతో కాలేజీ బోర్డ్ ను భారత్ కాలేజీ యాజమాన్యం తొలగించింది. మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల కు కేటాయించాల్సిన భవనం సరైనా వసతులులేక ఇబ్బందులకు గురవుతున్నామని అధ్యాపకులు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల అద్దెను కాలేజ్ ప్రారంభం నుండి ఇవ్వకపోవడం వలనే కళాశాలకు తాళం వేసినట్లు భారత్ కాలేజ్ యాజమాన్యం వాదించింది.