మూడు జిల్లాల విద్యార్థులకు గుడ్‌న్యూస్
మరో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు
హనుమకొండ, మార్చి14(ఆర్‌ఎన్‌ఎ):
హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 100 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ క్యాంపస్ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్యాంపస్ ఏర్పాటయితే.. బాసరలో మాత్రమే ఉన్న ట్రిపుల్ ఐటీ విద్య ఇప్పుడు హనుమకొండలో కూడా అందుబాటులోకి రానుం. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల విద్యార్థులకు అనువుగా ఉండేలా ఎల్కతుర్తిని ఎంపిక చేశారు. గురువారం (మార్చి 13న) హన్మకొండ జిల్లాకు వచ్చిన అధికారులు.. క్యాంపస్ ఏర్పాటుకు భూమిని పరిశీలించి, కలెక్టర్‌తో చర్చలు జరిపారు. రెండేళ్లలో క్యాంపస్ సిద్ధం కావచ్చని అధికారులు చెప్తున్నారు. హన్మకొండ జిల్లాలో కొత్త ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుతో చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు ఉన్నత విద్య సులభతరం కానుం. బాసరలో మాత్రమే ఉన్న ట్రిపుల్ ఐటీ ఇప్పుడు హనుమకొండలో కూడా అందుబాటులోకి రానుండటం విశేషం. ఎల్కతుర్తి మండల కేంద్రంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ నిర్మాణం జరుగుతుం. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో ట్రిపుల్ ఐటీలో మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చి, మరింత మం విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది.