భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల

నిర్దేశం, హైదరాబాద్: బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన డిమాండ్, దేశీయంగా నగల వర్తకుల నుంచి ఊపందుకున్న కొనుగోళ్లు పసిడి విలువను పైపైకి తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 980 పెరిగింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.900 పెరిగింది. అదేవిధంగా వెండి ధరసైతం భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజు కిలో వెండిపై రూ.వెయ్యి పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.లక్ష దాటేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే..

బంగారం ధర ఇలా..
హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణాల్లో 22 క్యారట్ల 10 గ్రా బంగారం ధర రూ.68,750కాగా, 10గ్రా 24క్యారట్ల గోల్డ్ ధర రూ.75,000.
ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రా బంగారం ధర రూ.68,900 కాగా, 24క్యారట్ల 10 గ్రా బంగారం రూ. 75,150.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రా గోల్డ్ ధర రూ.68,750 కాగా, 24క్యారట్ల 10గ్రా బంగారం ధర రూ. 75,000.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రా బంగారం ధర రూ.69,200 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 75,490కు చేరింది.

వెండి ధర ఇలా..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 1,00,500.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,00,500.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 96,000 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.96,000.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 94,750 వద్దకు చేరింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!