స్టీల్ ను తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్
బానూరు
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టీల్ తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు సీజ్ చేసారు. నాగులపల్లి సేల్ కంపెనీ నుంచి స్టీల్ ను లోడ్ చేసుకుని వెలిమలలోని ఓపెన్ స్థలంలో కొంత స్టీల్ ను డ్రైవర్లు డంప్ చేస్తున్నారు.
అర్థరాత్రి డంప్ చేస్తుండగా బానూర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక్కో లారీ నుంచి 500 కిలోల నుంచి 800 కిలోల స్టీల్ డంపింగ్ చేసినట్లు సమాచారంజ మేడ్చల్ కు రెండు, గచ్చిబౌలికి రెండు వెళ్తున్న లారీలను సీజ్ చేసి బానూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.