మునిసిపల్ మాజీ కౌన్సిలర్ భర్త దారుణ హత్య
జయశంకర్ భూపాలపల్లి, నిర్దేశం:
జిల్లా కేంద్రంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నాగవల్లి సరళ భర్త రాజ లింగమూర్తి పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లింగమూర్తిని ఆసుపత్రికి తరలించారు. రాజలింగమూర్తి మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు పలువురిపై భూపాలపల్లి కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి. రాజలింగమూర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.