జడ్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్..
80 మంది విద్యార్థులకు అస్వస్థత
జడ్చర్ల, నిర్దేశం:
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్తో పలువురు విద్యార్దులు అస్వస్థతకు గురైయారు. విషయం బయటికి రాకుండా డాక్టర్లను యూనివర్సిటీకి పిలిపించి వైద్యం అందించిన సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యం నయం అవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది. కేవలం 27 మందికే అస్వస్థత అని నిర్వాహకులు తెలిపారు. . కానీ దాదాపు 80 మంది విద్యార్థులకు అస్వస్థత అని సమాచారం. బయట ఫుడ్ తినడం వల్ల జరిగిందని చెప్తున్న నిర్వాహకులు, లేదు హాస్టల్ ఫుడ్ వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్దులు తేల్చి చెప్యపారు.