తుక్కుగూడలో ఉద్రిక్తత
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శ్రీశైలం హైవే ఫ్యాబ్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 11 గంటలకు బి ఆర్ ఎస్ నాయకులు బీజేపీ కి సవాల్ విసిరిన నేపథ్యంలో భారీగా మోహరించారు.
వెంకటేశ్వర స్వామి దేవాలయం కాంపౌండ్ వాల్ నిర్మించిన బి ఆర్ ఎస్ , దేవాలయ కమిటీ సభ్యులు, దేవాలయ భూముల్లో కాంపౌండ్ వాల్ నిర్మించారు. బిజెపి నేతలు గోడని కుల్చివేసి ప్రతి సవాలుగా ఆందోళనలు చేశారు.
సవాళ్లు ప్రతి సవాల్లా నేపథ్యంలో బి ఆర్ఎస్ ,బిజెపి నేతలను పోలీసులు అరెస్టు చేసారు. దేవాలయ ప్రాంగణానికి ఎవరు రావద్దంటూ బందోబస్తు ఏర్పాటు చేసారు.