వేగంగా హై స్పీడ్ ట్రైన్స్

వేగంగా హై స్పీడ్ ట్రైన్స్

నిర్దేశం, గాంధీనగర్ః

గత కొన్నేళ్లుగా భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వందే భారత్, హై స్పీడ్ రైల్, మెట్రో వంటి అత్యాధునిక రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలపైకి ఎక్కి ప్రయాణికులకు సౌకర్యవంతమైందే కాకుండా వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఢిల్లీ నుండి వారణాసి దూరం 840 కి.మీ. ప్రస్తుతం ఈ మార్గంలో రైలులో ప్రయాణించడానికి దాదాపు 12 గంటలు పడుతుంది. ఢిల్లీ-వారణాసి హై స్పీడ్ రైలు కారిడార్ పనులు 2029 నాటికి పూర్తవుతాయి. దీని మొత్తం వ్యయం రూ.43 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే వారణాసి నగరం వరకు ఈ మార్గంలో పనులు పూర్తయిన తర్వాత, ఈ మార్గంలో ప్రతిరోజూ 18 రైళ్లు నడుస్తాయని తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రతి 47 నిమిషాలకు ఒక బుల్లెట్ రైలు నడుస్తుంది.

ఢిల్లీ నుండి వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాలకు చేరుకోవడం సులభం అవుతుంది.అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే దేశంలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. ముందుగా ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైల్వే కారిడార్‌ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే భారతదేశ తొలి హైస్పీడ్ రైలు తయారీకి రంగం సిద్ధం అయింది.ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి నుండి రాజధాని న్యూఢిల్లీకి బుల్లెట్ రైలును నడపడానికి భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ నుండి దాదాపు 840 కి.మీ దూరంలో ఉన్న వారణాసికి ప్రయాణం అంత సులభం కాదు. రైలు అయినా, బస్సు ప్రయాణం అయినా, రోడ్డు ప్రయాణం అయినా, వారణాసి చేరుకోవడం అలసిపోయేలా చేస్తోంది.

విమాన ఛార్జీలు ఖరీదైనవి కాబట్టి, అందరూ దీనిని ఉపయోగించుకోలేరు. ఇప్పుడు బుల్లెట్ రైలులో కేవలం మూడున్నర గంటల్లోనే ప్రయాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.బుల్లెట్ రైలు ఉత్తరప్రదేశ్‌కు ఒక వరం లాంటిది. మీడియా కథనాల ప్రకారం, ఢిల్లీ నుండి వారణాసి వరకు బుల్లెట్ రైలు త్వరలో పరుగలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ-వారణాసి మధ్య ప్రయాణాన్ని కేవలం మూడున్నర గంటల్లో పూర్తి చేయవచ్చు. రెండు నగరాల మధ్య 12 స్టేషన్లు ఉంటాయి. ఈ రైలు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుండి ప్రారంభమై నోయిడా సెక్టార్ 146, జెవార్ విమానాశ్రయం, మధుర, ఆగ్రా, ఎటావా, కన్నౌజ్, లక్నో, రాయ్ బరేలి, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్, భడోహి మీదుగా వారణాసిలోని మండుదిహ్ స్టేషన్‌కు వెళ్తుంది.బుల్లెట్ రైలు కోసం ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్‌లో కొత్త భూగర్భ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. దీని కోసం 15 కి.మీ సొరంగం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో, యూపీ రాజధాని లక్నోలోని బుల్లెట్ రైలు స్టేషన్ అవధ్ క్రాసింగ్ సమీపంలో ఉంటుంది. ఈ స్టేషన్ అమౌసి విమానాశ్రయం, చార్‌బాగ్ రైల్వే స్టేషన్ మధ్య నిర్మించనున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »