నకిలీ ఆర్పిఎఫ్ ఎస్సై అరెస్టు
నిర్దేశం, సికింద్రాబాద్
నకిలీ అర్పిఎఫ్ మహిళా ఎస్సైని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి కి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసింది. 2018 లో అర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసిన మాళవిక దాదాపు అన్ని అర్హతలు సాధించింది. కానీ మెడికల్ చెకప్ లో దృష్టి లోపం కారణంగా తిరస్కరణకు గురైంది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ ఐ అవుతున్నట్లు చెప్పుకుంది.
తన పరువు పోతుందని భావించిన మాళవిక ఎస్ఐ యూనిఫాం కుట్టించుకోవడంతో పాటు, నకిలీ ఐడి కార్డ్ చేయించుకుంది. నార్కట్ పల్లి గ్రామంలో ఎస్సైగా చెలామణి అయింది మాళవిక. శంకర్ పల్లి లో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది.
పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫాం లోనే వెళ్లింది. యూనిఫాం లోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడం చేసింది. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు పై అధికారులను సంప్రదించగా మోసం బయటపడింది. తల్లి తండ్రులు భాద పడుతుండడంతో ఆమె ఇలాంటి పని చేసినట్లు తెలిపింది. ఇన్ స్టాగ్రాంలో అర్ పి ఎఫ్ యూనిఫాం లో రీల్స్ చేసిన మాళవిక. గత ఏడాదిగా నకిలీ ఎస్సై గా ఆమె చెలామణి అవుతోంది.