కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం

న్యూఢిల్లీ, మే 26 : మే 28వ తేదీన కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం ఉదయం 7.30 గంటలకే మొదలు కానుంది.ఈ నెల మే 28వ తేదీన కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయాలు జరుగుతున్నప్పటికీ…ఇదో చరిత్రాత్మక ఘట్టం అని మోదీ సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. పాత పార్లమెంట్‌లో కొన్ని లోపాలున్నాయని…వాటన్నింటినీ సవరిస్తూ కొత్త పార్లమెంట్‌ కట్టామని చెబుతోంది. ఈ వివాదాల సంగతి పక్కన పెడితే…ఆ రోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్రం ప్లాన్ చేసుకుంది.

పక్కా షెడ్యూల్ ప్రకారమే ప్రతిదీ జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ మే 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కొత్త పార్లమెంట్‌ని ప్రారంభిస్తారు. అయితే…ఉదయం 7 గంటల నుంచే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ఉదయం 7.30 గంటలకు హవన్ పూజ మొదలవుతుంది. 8.30 గంటల వరకూ ఇది కొనసాగుతుంది.8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో సెంగోల్‌ ని లోక్‌సభలో పొందుపరచనున్నారు. ఈ మొత్తం తంతులో ఇదే హైలైట్ అవనుంది.

9.30 గంటలకు ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాధువులు, పండితులు పాల్గొంటారు. ఆ తరవాత ఆది శంకరాచార్యకు పూజలు నిర్వహిస్తారు.ఆ తరవాత రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ పార్లమెంట్‌ని ప్రారంభిస్తారు. జాతీయ గీతాలాపనతో ఇది ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా రెండు షార్ట్ ఫిల్మ్స్‌ స్క్రీనింగ్ జరుగుతుంది. ఆ తరవాత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ చదువుతారు. రాజ్యసభలోని ప్రతిపక్ష నేత కూడా తన సందేశం వినిపిస్తారు.

ఈ కార్యక్రమం చివర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓ కాయిన్‌, స్టాంప్ విడుదల చేస్తారు. ఆ తరవాత ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2-2.30 గంటల మధ్యలో ఈ పూర్తి తంతు ముగుస్తుంది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా రాజకీయాలు ముదిరాయి. అన్ని పార్టీలనూ ఆహ్వానించామని బీజేపీ చెబుతున్నప్పటికీ.. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు విపక్షాలు ఆసక్తి చూపించడం లేదు. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పుడీ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. కొత్త పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతికి తగిన గౌరవం కల్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగ విలువల్ని కించపరిచారని ఆరోపించారు. లాయర్ జయసుకీన్ ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే 19 పార్టీలు తాము హాజరు కావడం లేదని లెటర్ రాశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత మాత్రమే పార్లమెంట్‌ని ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశాయి. కానీ…బీజేపీ మాత్రం దీనిపై గట్టిగానే వాదిస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండి పడుతోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!