ర‌స‌వ‌త్త‌రంగా క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌

నిర్దేశం, హైద‌రాబాద్ః ఉన్న‌త‌ చ‌దువులు ఉన్న‌వారు ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని చాలా మంది డిమాండ్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల చిత్రం చూస్తే.. ఉన్న‌త చ‌దువులు కాదు, ఉన్నత ఉద్యోగాలు చేసిన‌వారు పోటీకి దిగుతున్నారు. నిన్న‌ గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి ప్రసన్న హరికృష్ణ త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌గా.. నేడు డీఎస్పీ అయిన మ‌ధ‌నం గంగాధ‌ర్ త‌న ఉద్యోగానికి స్వ‌చ్ఛంద విర‌మ‌ణ ఇచ్చేసి పోటీ ప‌డుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

డీఎస్పీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలవైపు

పోలీసు ఉద్యోగం చేస్తున్న మధనం గంగాధర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మరుక్షణమే ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికలో ఇదొక కీలక అంశంగా మారింది. గంగాధ‌ర్ ఎంట్రీతో ఎమ్మెల్సీ ఎన్నిక‌లో స్వ‌తంత్ర అభ్య‌ర్థుల ప్రాధాన్య‌త పెరిగింది. చ‌ర్చ పెరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన గంగాధర్ అత్యంత నిరుపేద కుటంబంలో జన్మించారు. 22 ఏళ్లకే తొలి ప్రయత్నంలో ఎస్ఐగా సెలెక్ట్ అయిన గంగాధర్ పొలిస్ టు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. విధి నిర్వాహణలో ఆయన చేసిన సేవలకు కఠిన సేవా, ఉత్తమ సేవా, ముఖ్యంత్రి సర్వోన్నత పతకాలు పొందుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 200 రివార్డులను గంగాధర్ అందుకున్నారు.

అంత‌కు ముందు పోటీలో ప్రొఫెస‌ర్

గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి ప్రసన్న హరికృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పోటీలోకి దిగారు. పులి ప్రసన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం గుండన్నపల్లికి చెందినవారు. అయితే ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఆయ‌న చెప్ప‌డం గ‌మనార్హం. ప్ర‌ధాన పార్టీల‌కు అభ్య‌ర్థులు ఉండ‌డంతో ప్ర‌స‌న్న స్వ‌తంత్రంగానే బ‌రిలో నిలిచే అవ‌కాశం ఉంది.

ప్ర‌ధాన పార్టీలు ఒక‌వైపు.. ఇండిపెండెంట్లు ఒక‌వైపు

ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప‌రిస్థితి చూస్తే.. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గ‌ట్టి పోటీనే ఇచ్చేట్టు క‌నిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు బీజేపీకి బీఆర్ఎస్ కూ మంచి బలమే ఉంది. కారణం, ఆ ప్రాంతంలో బీజేపీ చాలా బలంగా ఎదిగింది. గడిచిన ఎన్నికల్లో బీజేపీ మంచి సీట్లు సంపాదించింది. ఇక బీఆర్ఎస్ ఈమధ్య పుంజుకున్నట్లు కనిపిస్తోంది. యువతలో, ఎడ్యూకెటెడ్ లో బీఆర్ఎస్ కు మంచి స్పందన వస్తోంది. అయితే వారికి ఎంత మాత్రం తీసిపోకుండా స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుండడం గమనార్హం.

20 లక్షల మంది పట్టభద్రులు

ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో 20 లక్షల మంది పట్టభద్రులు ఉన్నారు. వీరిలో 50 శాతం ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యెయేట్ స్థానం బరిలో 10 మంది వరకు ఉన్నారు. ప్రసన్న హరికృష్ణతోపాటు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీజేపీ నేత సుగుణాకర్ రావు, ట్రస్మా ప్రతినిథి యాదగిరి శేఖర్ రావు, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ బీఎన్ రావు, డాక్టర్ హరికృష్ణ, పోకల నాగయ్య పేర్లు వినిపిస్తున్నాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!