ఆన్లైన్ గేమ్స్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు

ఆన్లైన్ గేమ్స్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు

తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి

తాండూర్, నిర్దేశం :

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా (ఐపీఎస్) మంచిర్యాల డీసీపీ .భాస్కర్  ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో భాగంగా తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి మంగళవారం రోజున సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసు శాఖ వారి తరఫున ప్రజలకు ముందస్తు సమాచారం తెలియజేయడం జరుగుతుంది.       యువతను పెడదారి పట్టించి ప్రాణాలు తీయడమే కాకుండా వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మెదిరిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వీటి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి అన్నారు.
ఆన్‌లైన్ ఆట‌ల‌కు బానిస‌లుగా మారి ఎంతో మంది టీనేజ‌ర్లు, యువ‌కులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్నతనం నుంచే పిల్లలను తల్లిదండ్రులు ఆన్ లైన్స్ గేమ్స్ కు దూరంగా ఉంచాలి. బాల్యంలో గారాబం చేసి ఆడుకునేందుకు స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్ టాప్‌లు ఇవ్వడం ఆన్‌లైన్ గేమ్స్‌కి పిల్ల‌లను బానిస‌ల‌ను చేస్తోందన్నారు. త‌ల్లిదండ్రులు, పిల్ల‌ల మ‌ధ్య స‌రైన సంబంధాలు లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా పిల్ల‌లు ఆన్‌లైన్ గేమ్స్‌ వైపు ఆక‌ర్శితుల‌వుతున్నారు. ఎవ‌రి ప్ర‌పంచంలో వారు ఉండ‌టం వలన ఇలాంటి ప‌రిస్థితుల‌కు దారితీస్తోందన్నారు.ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి యువత పిల్లలు డబ్బులు పోగొట్టుకోకూడదని వీటిపట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ వాటికి దూరంగా ఉండే విధంగా మన ఆలోచన తీరును మార్చుకోవాలన్నారు యూట్యూబ్ వాట్సప్ ఇన్స్టాల్ క్రికెట్ బెట్టింగ్ ఏదైనా ఆన్లైన్ గేమ్ లకు ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు దూరంగా ఉండడమే మంచిదన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »