Take a fresh look at your lifestyle.

కేసీఆర్ పరిస్థితి పగోడికి రావద్దు..

0 13

కేసీఆర్ పరిస్థితి పగోడికి రావద్దు..
– కారు దిగుతున్న ఆ పార్టీ ఎంపీలు
– పోటీకి భయపడుతున్న నేతలు..
– ఎన్నికలకు దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులు
– టికెట్ హామితో బీజేపీలోకి ఎంపీ బీబీ పటేల్

(ఈదుల్ల మల్లయ్య)

కేసీఆర్.. ఈ మూడు అక్షరాలతో పదేళ్లు పాలన కొనసాగింది. అతను ఏది అనుకుంటే అదే వేదం.. ప్రశ్నించే ప్రతిపక్షాల నోరు మూసిన ఘన చరిత్ర కేసీఆర్ దే. ఇప్పుడు అదే పరిస్థితి కేసీఆర్ కు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ పార్టీ ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని అనుకునే వాళ్లు బీజేపీ కమలం వాసన పీల్చుతూ వెళుతున్నారు.

కేసీఆర్ పరిస్థితి పగోడికి కూడా రావద్దు

కేసీఆర్ పరిస్థితి పగోడికి కూడా రావద్దు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి పక్ష హోదాకు పరిమితం కావడంతో ఒక్కోక్కరు కారు దిగి కమలం వాసన చూస్తూ పరుగులు పెడుతున్నారు చాలా మంది ముఖ్య నాయకులు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్నీ అనుభవించినోళ్లు కూడా బీఆర్ ఎస్ కష్టాలలో ఉన్నప్పుడు ఇలా పార్టీని వదిలి పోవడం చూస్తుంటే కేసీఆర్ పై జాలి వేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావ్.. మా ఇంటికి వస్తే ఏమి తెస్తావ్.. ఇది పొలిటికల్ సామెత.. కానీ.. రాష్ట్రంలో అధికారం లేక పోవడంతో అంత వరకు ఆదరించిన పార్టీని వదిలి పోవడం నేటి రాజకీయ వినాయకుల సంస్కృతి. ఇగో.. బీఆర్ ఎస్ లో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్ లేదని భావించిన జహీరాబాద్ బీఆర్ ఎస్ ఎంపీ బీబీ పటేల్ శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల సమక్ష్యంలో బీజేపీ కండువ కప్పుకున్నాడు.

నాగర్ కర్నూల్ బీఆర్ ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరిన 24 గంటలు గడువక ముందే బీబీ పటేల్ కూడా బీఆర్ ఎస్ ను వదిలి బీజేపీలో చేరడం చర్చనీయంశంగా మారింది. బీఆర్ ఎస్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓటమీ తప్పదని భావించిన ఎంపీలు బీజేపీ లేదా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలనే పెద్దపల్లి బీఆర్ ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం..

మారిన రాజకీయ సమీకరణలతో బీఆర్ ఎస్ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడానికి నాయకులు జడుచుకుంటున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులు సైతం ఎన్నికలలో పోటీ చేయడానికి సుముఖంగా లేక పోవడం కూడా కారణంగా చెబుతున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దంగా లేరంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష హోదా రావడం వల్ల కేసీఆర్, కేటీఆర్, కవిత పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తారని మొదట్లో చర్చా ప్రారంభమైంది. కానీ.. మారిన రాజకీయ పరిస్థితులలో బీఆర్ ఎస్ ఎన్నికలలో పోటీ చేస్తుందా లేదా అనే చర్చా ప్రారంభమైంది. బీజేపీ సైతం బీఆర్ ఎస్ తో పొత్తుకు సిద్దంగా లేక పోవడంతో ఈ ఎన్నికలలో బీఆర్ ఎస్ భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నర్థకంగా మారింది.

టిక్కెట్ హామితోనే బీజేపీలోకి..

జహీరాబాద్ బీఆర్ ఎస్ ఎంపీ బీబీ పటేల్ కు బీజేపీ నుంచి టికెట్ కన్ ఫాం అయినట్లు తెలుస్తోంది. గత నెల రోజుల క్రితం ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్దికి కృషి చేశారని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే బీఆర్ ఎస్ కారు దిగి బీజేపీ వైపు వెళుతాడని బీబీ పటేల్ గురించి రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. రెండుమార్లు బీఆర్ ఎస్ ఎంపీగా పోటీ చేసిన బీబీ పటేల్ బీజేపీ అభ్యర్థిగా మరోసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking