ఆరుదైన శస్త్ర చికిత్స చేసిన అత్తాపూర్ జర్మన్ టెన్ ఆసుపత్రి వైద్యులు
రంగారెడ్డి జిల్లా, నిర్దేశం:
అత్తాపూర్ జర్మన్ టెన్ ఆసుపత్రి బృందం ఆరుదైన రికార్డ్ సృష్టించారు. ఎక్కడ కానీ సర్జరీ ఇక్కడ విజయవంతంగా చేసారు. 3 సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్ కి చెందిన రషీద్ మియా (11) అనే బాలుడు పటాసు పేలడం తో కుడి చేతి బొటన వేలితో పాటు 2 వేళ్లు, ఎడుమ చేతి లో రెండు వేళ్ళు కోల్పోయాడు. దీంతో హైదరాబాద్ అత్తాపూర్ జర్మన్ టెన్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మీర్ జవాద్ జాఫర్ ఖాన్ అధ్వర్యంలో డాక్టర్ల బృందం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు.రషీద్ కుడి కాలు కు వున్న వేలును తొలిగించి కుడి చేయి బొట్టన వేలు కు అతికించారు. దీంతో రషీద్ మియా కు బోటన వేలు తిరిగి వచ్చి తన పని తాను చేసుకుంటూ వున్నాడు. దాతల సహకారంతో జెర్మన్ టెన్ హాస్పిటల్ యాజమాన్యం సహకారం తో ఈ ఆపరేషాన్ నిర్వహించిన్నట్టు డాక్టర్లు తెలిపారు.