పరీక్ష పేపర్ లీకేజ్ లో సిట్ నిర్ణయాలు ప్రతిపక్షాలకు ఆయుధాలు..??

పరీక్ష పేపర్ లీకేజ్ లో సిట్ నిర్ణయాలు

ప్రతిపక్షాలకు ఆయుధాలు..??

సీఎం కేసీఆర్ కు ఏమైంది..? అతని గురించి తెలిసిన వారిలో ఉద్బవించే ప్రశ్న ఇదే. తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకున్నారు కేసీఆర్. ప్రజాక్షేత్రంలో ఉద్యమం తీసుకెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించారు కూడా. పేపర్ లీకేజ్ వ్యవహరంలో మాత్రం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు వివాద స్పదమవుతున్నాయి.

హైదరాబాద్, మార్చి 23 : ముప్పయి లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడిన పేపర్ లీకేజ్ వ్యవహరంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ‘‘పేపర్ లీకేజ్ లో తమకు సంబంధం ఏమిటి..?’’ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించడం.. పేపర్ లీకేజ్ వ్యవహరంలో ఇద్దరే ఉన్నారని పేర్కొనడం వివాదస్పదం అవుతున్నాయి.

పేపర్ లీకేజ్ వ్యవహరంలో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వేసిన ‘‘సిట్’’ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విజయం సాధించారు. మంత్రి కేటీఆర్ పిఎం తిరుపతికి ఈ పేపర్ లీకేజ్ తో సంబంధాలు ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం విధితమే.

అయితే.. పేపర్ లీకేజ్ కు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం తమకు ఇవ్వాలని సిట్ బృందం రేవంత్ రెడ్డికి నోటీస్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఆశిస్తుందెమిటో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సిట్ తీసుకునే నిర్ణయాలు మంచికో.. చెడుకో ప్రతిపక్షాలకు మాత్రం పొలిటికల్ మైలేజ్ బాగానే ఇస్తోంది. గురువారం సిట్ ఆఫీస్ కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోగై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే సిట్ తో విచారణ వద్దు.. సిబిఐతో విచారణ చేయాలని నినాదాలు చేశారు కాంగ్రెస్ శ్రేణులు.

పేపర్ లీకేజ్ వ్యవహరంలో ఇద్దరే నిందితులు అని మంత్రి కేటీఆర్ చెప్పిన తరువాత తొమ్మిది మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత విచారణ కోసం  కోర్టు అనుమతితో ఆధీనంలోకి తీసుకున్న పరీక్ష పేపర్ లీకేజ్ నిందితులను విచారిస్తే విస్తు పోయే విషయాలు వెలుగు చూసినవి. ముప్పయి మందికి పైగానే ఈ పేపర్ లీకేజ్ లో విచారణ చేస్తున్నారు అధికారులు. 

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో కొందరికి వచ్చిన మార్కులపై దృష్టి పెట్టిన సిట్ బృందం తనదైన శైలిలో విచారణ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో 80 నుంచి 90 మార్కులు రావాలంటే ఎంతో కష్టం.. మరి ముప్పయి మందికి పైగానే 100 నుంచి 120 మార్కులు రావడం చూసి సిట్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. తప్పు తమ వద్ద పెట్టుకుని ప్రభుత్వం పేపర్ లీకేజ్ వ్యవహరంలో పొలిటికల్ లీడరులకు నోటీస్ లు ఇవ్వడం రాజకీయ కక్ష్య సాధింపుగా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సిట్ బృందం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి మచ్చగా నిలుస్తోందంటున్నారు విశ్లేషకులు.

  • వయ్యామ్మెస్ ఉదయశ్రీ
Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!