దమ్ముంటే నా మీద పోటీ చేయు ఓ వైసీకి సవాల్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్

దమ్ముంటే నా మీద పోటీ చేయు
ఓ వైసీకి సవాల్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్

నిర్దేశం, హైదరాబాద్ :

దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చెయ్యి ఓవైసీ ? అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. గోషామహల్ లో అభ్యర్థులను నిలబెట్టాలని ఎంఐఎం నేతలకు రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ లోనే దారుసలెం, ఎంఐఎం ఆఫీస్ లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోషామహల్ లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టరు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడని తెలిపారు. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఒవైసీలకు లేదని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కాళ్ళు పట్టుకొని, ఇల్లీగల్ దందాలు చేసే చరిత్ర ఒవైసీ లది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులను నిలబెట్టి బ్లాక్ మెయిల్ దందాలు మొదలు పెట్టిండ్రని అన్నారు. ఒవైసీ కుటుంబమే అభివృద్ధి చెందుతోంది తప్ప ముస్లిం వర్గాలు కాదని కీలక వ్యాఖ్యలు చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!