ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నిర్దేశం :
జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, విద్యార్థుల హాజరు, సీ.సీ కెమెరా నిఘా, ప్రశ్నపత్రాల వేళపై వివరాలు తెలుసుకున్నారు. తాగునీరు, ఏఎన్‌ఎం, టాయిలెట్ల వసతి ఉన్నాయా? అని పరిశీలించారు.
పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలనీ, ఆన్సర్ షీట్లను పోలీసు బందోబస్తుతో తరలించాలనీ ఆదేశించారు. కాపీయింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని , ఆదేశించారు.
కలెక్టర్ వెంట చీఫ్ సూపరింటెండెంట్ సురయ్య, అధికారులు ఉన్నారు.