– సీఎం అయినా ఇంకా ప్రతిపక్ష నేత పోకడ వదలని రేవంత్
– నిరుద్యోగుల నిరసనపై అనవసరపు వ్యాఖ్యలు
నిర్దేశం, హైదరాబాద్: రేవంత్ రెడ్డి వెంటనే ఈ ప్రకటన అయినా ఇవ్వాలి, లేదంటే ఆ పనిలోనైనా ఉండాలి. లేదంటే, ప్రభుత్వానికి చాలా నష్టమే జరుగుతుంది. కారణం, ముఖ్యమంత్రిలా కాకుండా ఇప్పటికీ ప్రతిపక్ష నేతలాగే వ్యవహరిస్తున్నారు. ఆయన మాట, శైలి హుందాగా ఉండడం లేదనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. తాజాగా చూసుకుందాం.. నిరుద్యోగుల నిరసనలను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తాయి.
నిరుద్యోగ నిరసనలో పాల్గొనేవారు ఏ ఉద్యోగానికి అప్లై చేయలేదని, వారి దగ్గర హాల్ టికెట్లే ఉండవని అన్నారు. నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడాలంటే ఉద్యోగాలకు అప్లై చేయాలా? ఇదేం స్టేట్మెంట్? సమస్య గురించి ఎవరైనా మాట్లాడొచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ ఏ ఉద్యోగం అప్లై చేశారని నిరుద్యోగుల నిరసనలో పాల్గొన్నారు? మణిపూర్ గురించి మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ విరుచుకుపడుతున్నారు. మరి వారంతా మణిపూర్ వారేనా? మానవతావాదంతో స్పందిస్తారు. ఉద్యమాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే వారి మీద విమర్శలు చేస్తే చేయవచ్చు కానీ, పూర్తిగా ఉద్యమాన్నే తప్పుపడితే ఎలా? అది కూడా ముఖ్యమంత్రిగా ఉండి.
విపక్ష నేతగా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జనాలు విజిల్స్ కొట్టేవారు. ఆయన భాష అంగీకారం కాకపోయినా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీకొట్టాలంటే రేవంతే సరైన వ్యక్తని ప్రజలు అనుకునేవారు. అది విపక్ష నేతగా బాగానే ఉంటుంది. కానీ, ప్రభుత్వం అంటే.. ఆచితూచి మాట్లాడాలి. తన పదవి గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలి. మిత్రులు, శత్రవులను అందరినీ కలుపుకుని పోవాలి. కానీ, రేవంత్ ముఖ్యమంత్రి అయినా విపక్ష నేతగానే వ్యవహరిస్తున్నారు.
సీఎం అయిన మొదట్లోనే.. బాంబులు విసురుతా, అంతు చూస్తా, పేగులు తీస్తా అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఏదో సందర్భంలోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నాయి. తాజాగా నిరుద్యోగుల నిరసనపై తీరు అలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే.. నిరుద్యోగుల నిరసనను ఉపయోగించుకుని, కానీ తన కొమ్మను తానే నరుక్కునే విధంగా కనిపిస్తోంది ఆయన తీరు. నిజానికి.. రేవంత్ చేసే వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చు. కానీ, ఆయన వెల్లడించే తీరు నిరుద్యోగులకు ఆగ్రహం తెప్పించుకూడదు.
ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కుంటోంది. దేశంలో ఇంత తొందరగా వ్యతిరేతను మూటగట్టుకున్న మొట్టమొదటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారే. ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తికి తమవారు, ఇతరులు అంటూ ఉండరు. కానీ, రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక పార్టీ నాయకుడిగానే వ్యవహరిస్తున్నారు. సర్ది చెప్పాల్సిన అనేక విషయాల్లో వివాదాస్పదంగా, ఘర్షణపూర్వకంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన తీరు ఇలాగే ఉంటే కాంగ్రెస్ సర్కారు భారీ మూల్యమే చెల్లించుకుంటుంది. అయితే ఆయన తీరైనా మారాలి. లేదంటే, మంచి అడ్వైజర్ ను అయినా పెట్టుకోవాలి.
డ్వైజర్ ను అయినా పెట్టుకోవాలి.