ఎంత మ‌సి పూసినా.. మునుముందుకే

నిర్దేశం, హైద‌రాబాద్ః కన్ఫ్యూజన్‌ ఏం లేదు.. ఆవేశం అంతకన్నా లేదు.. చేసే పనేంటి? దాని వల్ల జరిగే లబ్ధేంటి? వచ్చే అడ్డంకులేంటి? ఏం చేస్తున్నాం.. ఎలా చేస్తున్నాం.. ఇలా ప్రతిపనిపై చాలా క్లియర్ కట్‌గా ముందుకెళ్తున్నారు. అందుకే ఎవరేమన్నా.. ఎలా విమర్శించినా.. ఎన్ని అడ్డంకులు కల్పించినా.. తగ్గేదేలే.. వెనకడుగు వేసేదేలే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మూసీ రీవర్‌ ఫ్రంట్.. ఇప్పుడదే సీఎం రేవంత్ రెడ్డి ఏజెండా.. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్‌ చేస్తున్న ఘటన ఇది. మూసీ బాధితులంతా ఆందోళనలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితుల తరపున పోరాటమంటూ విపక్ష నేతలు రంగంలోకి దిగారు. చేయాల్సిన రాజకీయం చేస్తున్నారు. ఎమోషన్స్‌ను తట్టి లేపుతున్నారు. వారిలోని భయాన్ని అస్త్రంగా మలుచుకుంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై వెనకుడుగు వేస్తుందా? మూసీ నది ప్రక్షాళనతో పాటు.. అక్రమ కట్టడాల విషయంలో వెనక్కి తగ్గుతుందా?

మార్పు మంచిదే

కష్టాలేంటో తెలుసు.. వారు పడుతున్న బాధలు కూడా తెలుసు.. కానీ భవిష్యత్తు బంగారమయంగా ఉండాలంటే.. కాస్త కష్టాలు తప్పవంటున్నారు సీఎం రేవంత్. నిజమే కదా, మురికి కంపులో బతకడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? వారు మార్పు కోరుకుంటారు.. అయితే ప్రభుత్వం సరైన న్యాయం చేస్తుందా? లేదా? అనేదే వారి భయం. అందుకే పోరాటానికి దిగుతున్నారు. అంతే తప్ప వారి జీవితాల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. బట్, బాధితుల్లో ఉన్న భయమే ఇప్పుడు విపక్షాలకు పెట్టుబడిగా మారినట్టు కనిపిస్తోంది. బుల్డోజర్లు తమ మీదుగానే వెళ్లాలంటున్నారు కొందరు విపక్ష నేతలు. ఇదేం తీరు అనేది అర్థం కావడం లేదు. ఇంటి పక్కనే మూసి మురుగు పారుతుంది. గట్టిగా గంటసేపు వర్షం కురిస్తే ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి ఆ నీళ్లు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారిని బయటికి తీసుకురావడం తప్పేలా అవుతుంది.. ?

నిజమే కదా.. మూసీ బాధితులకు సమస్యలున్నాయి. ఆ సమస్యలేంటో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఇప్పటికే అధికారులు సర్వేలు చేస్తున్నారు.. వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వారిని ఎలా రీలోకేట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వారికి కేటాయిస్తున్నారు. కొందరు స్వచ్చంధంగా తమ ఇళ్లను ప్రభుత్వానికి అప్పగించేసి వెళ్లిపోయారు కూడా. అయితే చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి. వారే ఇప్పుడు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారితో కూడా చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది.

మూసీ ప్రాజెక్ట్ పాత‌దే

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది ఏమైనా కొత్త ప్రాజెక్టా? బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో కూడా నిర్ణయం తీసుకున్నారు కదా. 2018లోనే ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చ మొదలైంది కదా. దీనికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను కూడా రెడీ చేయాలని ఆదేశించారు కదా. కానీ ఆ వెంటనే ఆ ప్రాజెక్ట్‌ను అటకెక్కించేశారు. కానీ రేవంత్ సర్కార్‌ ఇప్పుడా ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కాస్త కష్టమని తెలిసినా అడుగులు ముందుకే వేస్తోంది. మరి మీరు చేస్తే కరెక్ట్.. రేవంత్ చేస్తే తప్పేలా అయ్యిందో మీకే తెలియాలి.

త‌గ్గేదేలే

మూసీ గురించి తెలుసుకుంటున్న కొద్ది కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మూసీ నది గర్భంలో కూడా కొందరికి పట్టాలు ఉన్నాయి. వారిని కూడా గుర్తించి పరిహారం ఇస్తామని చెబుతోంది ప్రభుత్వం. పరిహారం ఇస్తాం.. పునరావాసం కల్పిస్తాం. అవసరమైతే ఇంకేదైనా చేస్తాం. కానీ ప్రాజెక్ట్‌ను మాత్రం ఆపేది లేదు. అడుగులు ముందుకే కానీ.. వెనకకు పడేది లేదు. ఓ మంచి పని చేసేందుకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలే.. ఆగేదేలే. ఇదే కాన్సెప్ట్‌తో ఇప్పుడు ముందుకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »