రెండురోజులుగా ఢిల్లీలోనే సీఎం, మిగిలిన మంత్రులు
రాష్ట్రానికి రావాల్సిన వాటా, నిధుల కేటాయింపులపై విజ్ఞప్తులు
హైదరాబాద్, నిర్దేశం:
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన రెండోరోజు కొనసాగింది. కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో సీఎం, మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతి చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరి గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. గత పదేళ్లుగా తెలంగాణలో ఎక్కడా కూడా రేషన్ కార్డు అమలుకాలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు రేషన్ కార్డులను ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ముమ్మరం చేశారు.
రేషన్ కార్డుల కోటా కింద రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ధాన్యం, సబ్సీడీని కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం సేకరణ పెద్ద ఎత్తున జరిగింది. దాదాపు 66.76లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం ప్రెక్యూర్కు సంబంధించి కేంద్రం తన వాటాను కొనుగోలు చేయాలని, అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించి గతంలో పెండిరగ్లో ఉన్న నిధులతో పాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులపై కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. దేశంలో ధాన్యం సేకరణలో పంజాబ్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో హర్యానా, మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా.. సన్న బియ్యానికి రూ.500 బోనస్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో కంటే కూడా ఈ ఏడాది ఎక్కువగా ధాన్యం సేకరణ జరిగింది. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వకపోయిప్పటికీ లక్షల హెక్టార్లలో పంటను పండిరచి రూ.500 సబ్సీడీతో పంటను కొనుగోలు చేసింది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉగాది నుంచి రేషన్ సరఫరా ద్వారా సన్న బియ్యాన్ని ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సిన నిధులను తెలంగాణకు వెంటనే మంజూరు చేయాల్సిందిగా కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖకు సంబంధించిన ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోమవారం తొలిరోజు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్. దాదాపు దాదాపు గంట పాటు వీరి సమావేశం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో పలు నీటి ప్రాజెక్టులపై ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పర్యావరణ అనుమతులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంగళవారం కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో భేటీ అయిన సీఎం రేవంత్, ఉత్తమ్.. సాయంత్రం ఢల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు రానున్నారు.