కేంద్ర సర్కార్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం ప్రసంగం ఇదే..
కేంద్రం ప్రవేశ పెట్టిన 45లక్షల కోట్ల బడ్జెట్ లో 15లక్షల కోట్లు అప్పులు చూపింది.
రాష్ట్ర విభజన హక్కుల చట్టం ప్రకారం ఖాజీపేట రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్శిటీ, ఐటిఐఆర్ ఇలా ఒక్క ప్రాజెక్టుకు నిధులు ఇద్దామన్న ఆలోచన చేయలే. తెలంగాణకు ఇచ్చింది గుండు సున్న.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కార్యకలపాలకు నిధులు ఇవ్వకపోగా అడిగితే కేసులు, మాట్లాడితే ఐటీ, ఈడీ, సిబి ఐ వస్తయి. ప్రభుత్వాలకు ప్రభుత్వాలనే కూల్చివేస్తది. ప్రశ్నిస్తే మనుషులకు మనుషులనే లోపలేస్తది.. ప్రజస్వామ్యమే లేకుండా మోడీ నియంతృత్వ పాలన చేస్తున్నడు.
దేశంలో పేదలు నిరుపేదలుగా మారుతుంటే ధనవంతులు సంపన్నులుగా ఎదుగుతున్నారు. ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయి.
మతం పేరిట దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి రక్తపాతం సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి విచ్చిన్నకర శక్తులు చేస్తున్న కుట్రల నుంచి దేశాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి కన్యకూమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు.
రాహుల్ పాదయాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. పేదలు, కూలీలు, రైతులు, యువత పెద్ద ఎత్తున ఎదురొచ్చి స్వాగతం పలికి హక్కున చేర్చుకున్నారు.
దేశం దోపిడి పాలవుతుందని, సంపదను ప్రధాని మోడీ ఆదానికి దోచి పెడుతున్నారని పాదయాత్రలో ప్రజలు రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రపంచమే ఆశ్చర్యం పోయేట్టుగా హిండెన్ బర్గ్ ఆధాని ఆర్ధిక నేరాన్ని బట్టబయలు చేసింది.
దేశాన్నే కాదు. ప్రపంచాన్నే మోసం చేసిండు. దేశాన్ని లూఠి చేసిండు.
ఆదానిపై దాడి దేశం మీద దాడి అనడం సరికాదు. ఇండియా అంటే ఆదాని? ఆదాని అంటే ఇండియా మాత్రమేనా? ఇండియా అంటే ఆదాని, అంభాని, మోడీ, అమిత్ షా మాత్రమే కాదు. తమ రక్తాన్ని చెమటగా చిందించి ఉత్పత్తి సృష్టించిన కోట్లాది ప్రజలది ఈ దేశం. ఈ విషయాన్ని విమర్శకులు గ్రహించాలి.
దేశంలో తెలంగాణ కూడ అంతర్భాగమే. ఆదాని చేసిన ఆర్ధిక నేరం వల్ల ఎల్ఐసి, ఎస్ బి ఐ సంస్థల్లో తెలంగాణ ప్రజలు దాచుకున్న డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది.
మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఆధానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.
దేశ సంపదను మోడీ ప్రభుత్వం క్రోని క్యాప్టలిస్టులకు దోచి పెడుతుంది. కట్టడి చేయకుంటే ఇది దేశానికి ప్రమాదం.
దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, ఆసుపత్రలు కట్టింది. రోడ్లు వేయించింది. సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. యూజీసి తీసుకొచ్చింది. ప్లానింగ్ కమిషన్ వేసింది. అందరికి సమాన హక్కులు కల్పిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించింది.
మిశ్రమ ఆర్ధిక విధానాల ద్వారా ఆస్తులను సృష్టిస్తే… అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం ఆస్తులను అమ్ముతున్నారని మండిపడ్డారు.
ఎయిర్ పోర్టు సంస్థలను అనుభవం లేని సంస్థలకు, రెండుకు మించి ఎవ్వరికి ఇవ్వోద్దనే నిబంధన ఉన్న ఆదానికి 6 ఎయిర్ పోర్టులను ప్రధాని మోడీ కట్టబెట్టారు.
ఇప్పటికే సర్వీస్ సెక్టర్, ఇన్ ఫ్రా సెక్టర్, కోల్ బ్లాక్ లను అమ్మేశారు.
వ్యవసాయ రంగాన్ని కూడ కార్పోరేట్ అగ్రికల్చర్ గా తీసుకొచ్చి అమ్మాలనే కుట్ర జరుగుతున్నది. ఇదే జరిగితే దేశం ప్రజస్వామ్యం, రాజ్యంగం చేతుల్లో ఉండదు.
కార్పోరేట్ చేతుల్లో పెట్టి వారి దయ దాక్షిణ్యాలపై బ్రతికే విధంగా బిజెపి చేస్తున్నది.
నల్లరైతు చట్టాలను తీసుకొచ్చినప్పుడే కేంద్రం ధరల నియంత్రణ చట్టాన్ని ఎత్తివేయడం వల్ల కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చింది. దేశంలో ఎక్కడనైన కొనుక్కో… గోదాముల్లో దాచుకో.. వస్తువుల కొరత పెంచి అధిక ధరలకు అమ్ముకో అని కార్పోరేట్లకు అనుకూలంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తున్నది.-
మతం మత్తు లాంటిది. దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.
మతం మత్తు దేశానికి అత్యంత ప్రమాదకరం, మతం మత్తు మందు అన్నందుకే సోక్రటీస్ కు విషమిచ్చి చంపారు.