Take a fresh look at your lifestyle.

‘‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’’ ముంభై దర్శన్ – ఆ పది గంటలు మరిచి పోలేని అనుభూతులు..

ముంభై.. ముఖ్యమైన పర్యాటక కేంద్రం.. ఎన్నో వింతలు.. విశేషాలు..

0 1,033

‘‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’’ ముంభై దర్శన్
– ఆ పది గంటలు మరిచి పోలేని అనుభూతులు..
ముంబై మహానగరం.. తూర్పున ఉదయించిన సూరీడుతో ప్రారంభమయ్యే జనం ఉరుకులు పరుగులతో కనిపిస్తుంటారు. ‘‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’’ గా పిలిచే ఈ ముంభైలో పర్యాటిస్తుంటే చుట్టూ అరేబియా మహా సముద్రం అలలు హాయ్ అంటూ పలుకరిస్తాయి.

దోస్త్ శ్రీకాంత్ తో ముంభై టూర్..

ఇటీవల నేను, స్నేహితుడు శ్రీకాంత్ ముంభై నగరంకు వెళ్లాం. దాదర్ రైల్వే స్టేషన్ ముందు గల ఏ – వన్ ట్రావెల్స్ లో మూడు వందల యాభై రూపాయల చొప్పున రెండు ‘ముంభై దర్శన్’ టికెట్ లు తీసుకుని ఉదయం 9 గంటలకు ఏసీ బస్సులో కూర్చున్నాం. ముప్పై నలుగురు పర్యాటకులతో బస్సు కదిలింది. కిటికి పక్కనే కూర్చుని ఉన్న నాకు సెల్ ఫోన్ లు చూస్తూ పరుగులు పెడుతున్న జనం వింతగా కనిపించారు.

ఆకాశంను అందుకుంటున్న అపార్ట్ మెంట్ భవనాలు.. రోడ్ పక్కనే అనాధలుగా పడి ఉండే నిరు పేదలు.. రోడ్ పక్కనే గుడిచెలలో నివాసం ఉంటే వలస కూలీల బతుకులను చూస్తే బాధగా అనిపించింది. జనంతో రద్దిగా ఉన్న రోడ్ల వెంట బస్సు వెళుతుంటే ఆ ప్రాంతంలోని విశేషాలను హిందిలో చమత్కరంగా ఇద్దరు టూరిస్ట్ గైడ్ లు ప్రభాకర్ మరియు సుభాష్ వివరిస్తున్నారు. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ప్రారంభమైన మా టూర్ రాత్రి 7 గంటలకు ముగిసింది.

టూరిస్ట్ గైడ్ సుభాష్ మాటల్లో…

ఇది ఐకానిక్ పాత-ప్రపంచ వాస్తుశిల్పం, ఆధునిక ఎత్తైన భవనాలు, సాంస్కృతిక మరియు సాంప్రదాయ నిర్మాణాలు మరియు మురికివాడల యొక్క ప్రత్యేకమైన మిశ్రమం. శక్తివంతమైన వాణిజ్య రాజధాని ముంభై, లోకల్ రైళ్లు, స్ట్రీట్ ఫుడ్, హై-ఎండ్ రెస్టారెంట్లు మరియు నైట్ లైఫ్ ఉన్నాయి.


ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియాకు ప్రత్యేక స్థానం ఉంది. అపోలో బందర్ వాటర్ ఫ్రంట్ వద్ద అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న గంభీరమైన నిర్మాణం నగరం యొక్క వలస గతానికి నిదర్శనం. 26-మీటర్ల బసాల్ట్ ఆర్చ్‌వే సాంప్రదాయ హిందూ మరియు ముస్లిం డిజైన్‌లతో రోమన్ విజయోత్సవ తోరణాల నిర్మాణ శైలులను మిళితం చేస్తుంది. కింగ్ జార్జ్ V మరియు క్వీన్ మేరీలు 1911లో బ్రిటిష్ ఇండియాను సందర్శించినప్పుడు స్వాగతం పలికేందుకు దీనిని నిర్మించారు.

గేట్ వే ఆఫ్ ఇండియాతో టూర్..

గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి పర్యాటకులు బోట్ రైడ్, ఫెర్రీ రైడ్ లేదా ప్రైవేట్ యాచ్‌ని ఆనందించవచ్చు. తాజ్ మహాల్, తాజ్ మహాల్ హోటల్, ప్రిన్స్ ఆఫ్ వాల్యుస్ మ్యూజియం, జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, మంత్రలయ, అసెంబ్లీ, నారియన్ ఫాయింట్, ఒబెరాల్ హోటల్, ఎయిర్ ఇండియా బిల్డింగ్, వాంకేడ్ స్టేడియం, గిరిజన్ చౌహాపతి, జైన్ టెంపుల్, కమల నెహ్రూ పార్క్, బూట్ హౌజ్, హ్యంగింగ్ గార్డెన్, టవర్ ఆఫ్ సైలెన్స్, మహాలక్ష్మీ టెంపుల్, రేస్ కోర్సు, ఒర్మా 4డీ షో, నెహ్రూ ప్లానిటోరియం,

నెహ్రూ సైన్స్ సెంటర్, బంద్ర – వర్లి షీ లింక్, సిద్ది వినాయక టెంపుల్, మౌంట్ మేరీ చర్చ్, ఫిలీం స్టార్స్ బిల్డింగ్స్, బొంబాయి బై నైట్ విజన్ ఇలా ముంభై దర్శన్ లో ఎన్నో వింతలు విశేషాలు చూశాం. ఆయా ప్రాంతాలలో మెమోరి కోసం ఫోటోలు దిగాం..
నిజానికి ముంభై వెళ్లినోళ్లు తప్పకుండా ముంభై దర్శన్ చేసుకోవాల్సిందే.

గైడ్ సుబాష్, ఏ -వన్ ట్రావెల్స్, దాదర్ (సెల్: 8108965210) కంటాక్ట్ చేయండి.

– యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking