చైనా టూ అమెరికా..వయా కొరియా

చైనా టూ అమెరికా..వయా కొరియా

– అమెరికా సుంకాల‌తో కొత్త దారి వెతుక్కున్న చైనా
– ద‌క్షిణ కొరియా లేబుల్ తో అమెరికాలో ప్ర‌వేశం
– ప‌సిగ‌ట్టి ద‌ర్యాప్తుకు దిగిన ద‌క్షిణ కొరియా

నిర్దేశం, న్యూఢిల్లీః

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ఏప్రిల్‌ 2న రష్యా, ఉత్తర కొరియా మినహా మిగతా దేశాలపై ఈ టారిఫ్‌లు అమలులోకి వస్తాయని ప్రకటించారు. తర్వాత వారానికే టారిఫ్‌ల అమలు మూడు నెలలు వాయిదా వేశారు. అయితే అమెరికా సుంకాలకు ప్రతీకారంగా చైనా కూడా సుంకాలు విధించండం.. అమెరికా బెదిరింపులకు భయపడకపోవడంతో చైనాపై భారీగా సుంకాలు విధించారు. ప్రస్తుతం చైనా దిగుమతులపై 245 శాతం సుంకాలు అమలు చేస్తోంది. దీంతో చైనా సుంకాల భారం తప్పించుకునేందుకు కొత్త దారులు వెతుకుతోంది.అమెరికా చైనాపై 245 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ప్రపంచ వ్యాప్తంగా సుంకాల అమలు మూడు నెలలు వాయిదా వేసినా.. చైనాపై మాత్రం అమలు చేస్తోంది. దీంతో చైనా టారిఫ్‌ల భారం తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుకుతోంది.

ఇటీవల దక్షిణ కొరియాపై అమెరికా 25% టారిఫ్‌లు విధించింది. అయితే ఈ టారిఫ్‌లు ప్రస్తుతం అమలు ఆవడం లేదు. దీంతో చైనా తన ఉత్పత్తులను ‘మేడ్ ఇన్ కొరియా’ అని లేబుల్ చేసి, అమెరికా మార్కెట్‌లోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చర్య ద్వారా చైనా ఉత్పత్తులు తక్కువ టారిఫ్‌లతో అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉంది, ఇది దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. దక్షిణ కొరియా కస్టమ్స్ అధికారులు ఈ సమస్యను గుర్తించి, అమెరికా అధికారులతో సంయుక్త దర్యాప్తును ప్రారంభించారు. ఈ దర్యాప్తు ద్వారా చైనా ఉత్పత్తులపై తప్పుడు లేబులింగ్‌ను అడ్డుకోవడం, అలాగే అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ఉల్లంఘనను నిరోధించడం లక్ష్యంగా ఉంది. ఈ సమస్య వల్ల దక్షిణ కొరియా ఉత్పత్తుల పరిశ్రమలకు ఆర్థిక నష్టం, అలాగే అమెరికాతో వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

చైనా ఈ విధమైన వ్యూహాలను అవలంబించడం వల్ల అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు భంగం కలుగుతుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం, ఉత్పత్తి యొక్క మూలం స్పష్టంగా తెలియజేయాలి. చైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ, తప్పుడు లేబులింగ్‌తో అమెరికా మార్కెట్‌ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇది దక్షిణ కొరియాతో పాటు ఇతర దేశాల వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చుదక్షిణ కొరియా మరియు అమెరికా ఈ సమస్యను నిశితంగా పరిశీలిస్తున్నాయి. చైనా ఉత్పత్తులపై కఠిన తనిఖీలు, అలాగే అంతర్జాతీయ సమాజంతో కలిసి చైనాపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటన వాణిజ్య యుద్ధాలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది, దీని పర్యవసానాలు ఆసియా మరియు పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడవచ్చు. ఈ సమస్య అంతర్జాతీయ వాణిజ్యంలో నీతి, నిజాయితీల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »