సెట్టింగ్స్ మారిస్తే సైబర్ క్రైమ్ కు దూరం
హైదరాబాద్, నిర్దేశం:
కొంతకాలంగా ఆన్‌లైన్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు ఎక్కువగా వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక్కడ నకిలీ సందేశాలు, ఫిషింగ్ లింక్‌లు, కాల్‌ల ద్వారా అమాయక ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మీరు అస్సలు ఆందోళన చెందకూడదు. వాట్సాప్‌లో కొన్ని ప్రైవసీ సెట్టింగ్‌లను ఆన్ చేయడం ద్వారా మీరు ఈ ఆన్‌లైన్ మోసాలను నివారించవచ్చు. మీరు ఇప్పుడే ఆన్ చేయవలసిన ప్రత్యేక సెట్టింగ్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీ ప్రొఫైల్ చిత్రాన్ని చూసి కూడా చాలా మంది స్కామర్లు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు మీ ఫోటోను కూడా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకే మీ ప్రొఫైల్ చిత్రాన్ని ఎప్పుడు తెలియని వ్యక్తులకు కనిపించకుండా మీ ఫ్రొఫైల్ లో ఉన్నవారు మాత్రమే చూసేలా సెట్ చేయాలి. దీన్ని మార్చడానికి, ముందుగా మీరు సెట్టింగ్‌లు > ప్రైవసీ > ప్రొఫైల్ ఫోటోకి వెళ్లాలి. అక్కడ ఓన్లీ మై కాంటాక్స్ట్ మీద క్లిక్ చేయండి.మీరు లాస్ట్ సీన్ వివరాలు, ఎబౌట్ లను వాట్సాప్‌లో అందరికీ ఓపెన్ చేసి ఉంచితే స్కామర్లు మీ కార్యాచరణను ట్రాక్ చేయవచ్చు. అవును, ఈ రోజు ఆ వ్యక్తి ఎప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చాడనే దాని గురించి సమాచారం పొందడానికి ఇలాంటి యాప్‌లు చాలా అందుబాటులో ఉన్నాయి. దీనితో, స్కామర్లు మీరు ఏ సమయంలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు? మిమ్మల్ని ఎప్పుడు లక్ష్యంగా చేసుకోవడం ఉత్తమం వంటి ప్లాన్ లు వేసుకుంటారు. కాబట్టి, ‘లాస్ట్ సీన్’ ‘ఎబౌట్’ లను ఆఫ్ చేయండి.ఈ జాబితాలో ఇది అతి ముఖ్యమైన సెట్టింగ్, దీనిని మీరు అస్సలు లైట్ తీసుకోవద్దు. నిజానికి, మీరు ఈ సెట్టింగ్‌ని ఆన్ చేసిన తర్వాత, మీ అనుమతి లేకుండా ఎవరూ మీ వాట్సాప్‌ను ఉపయోగించలేరు. ఈ సెట్టింగ్‌ని ఆన్ చేయడం ద్వారా, ఎవరైనా మీ ఓటీపీని తీసుకోవాలి అనుకున్నా సరే వారు మీ వాట్సప్ ఖాతాను ఉపయోగించలేరు. మీ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి ఓటీపీ తర్వాత 6 అంకెల పిన్‌ను నమోదు చేయమని స్కామర్ మిమ్మల్ని అడుగుతాడు. అయితే ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయడానికి, ముందుగా వాట్సాప్ సెట్టింగ్‌లకు వెళ్లండి. దీని తరువాత, సెట్టింగ్‌లలో ప్రైవసీ > డబుల్ వెరిఫికేషన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు 6 అంకెల పిన్ సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇప్పుడు మీరు మీ ఇమెయిల్ ఐడిని ఇక్కడ యాడ్ చేయాలి. తద్వారా మీరు పిన్‌ను మరచిపోతే దాన్ని మళ్ళీ రీసెట్ చేయవచ్చు.కొంతకాలంగా, స్కామర్లు మొదట మీ ప్రయోజనాల గురించి పెద్ద పెద్ద విషయాలు చెప్పే గ్రూపులో చేర్చుతారు. కానీ మీరు వారి ఉచ్చులో పడితే, అది మీ బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేస్తుంది. అందువల్ల, మిమ్మల్ని ఎవరు గ్రూప్ లో యాడ్ అవమని అడిగినా సరే అవద్దు. దీన్ని మార్చడానికి, మీరు వాట్స్ ప్ సెట్టింగ్‌లు > ప్రైవసీ > గ్రూప్‌లకు వెళ్లాలి. ఇప్పుడు ఇక్కడ కాంటాక్స్ట్ లో ఉన్న వారికి మాత్రమే అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.