అధికారికలాంచనాలతో జరుపడం అగౌరవ పరచడమే..

గద్దర్ అంత్యక్రియలను అధికారికలాంచనాలతో జరుపడం

 పోలీసు అమరవీరులను అగౌరవ పరచడం

– ATF ( యాంటి టెర్రరిజం ఫోరం ).

హైదరాబాద్, ఆగస్టు 07 : గద్దర్ కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ ( మావోయిజం ) వ్యతిరేఖ పోరాటంలో అమరులైన పోలీసుల మరియు పౌరుల త్యాగాలను అవమానించడమే .

నివాళులు అర్పిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనర్..

గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి . ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుంది, నక్సలిజం ( మావోయిజం ) సాధారణ పౌరులపై మరియు జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుంది.

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య , ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో మరియు శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను మరియు ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుంది .

ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది .ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరు ఖండించాలి, పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయి. పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోనేలా చూడాలని కోరుతున్నాము.

దీనిని ఒక వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని అధికారికంగా అంత్యకియలు జరిపితే ప్రభుత్వం నక్సలైట్ ( మావోయిజం ) భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుంది. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ATF ( యాంటి టెర్రరిజం ఫోరం ) డిమాండ్ చేస్తుంది .

– ATF ( యాంటి టెర్రరిజం ఫోరం ).

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!