తెలంగాణలో ఊపందుకున్న క్యాస్ట్ పాలిటిక్స్‌

తెలంగాణలో ఊపందుకున్న క్యాస్ట్ పాలిటిక్స్‌

హైదరాబాద్, నిర్దేశం:

రాకీయాల్లో కులాల ప్రస్తావన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసలు ప్రధాని మోదీ బీసీ కులానికి చెందిన వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌పై బీజేపీ భగ్గుమంది.ఇటీవల తెలంగాణలో కులగణన జరిగింది. ఈ నివేదికను సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి. ప్రభుత్వానివి కాకి లెక్కలని బీఆర్ఎస్ విమర్శించింది. కానీ బీజేపీ మాత్రం కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారని కేంద్రమంత్రి బండి సంజయ్ లాంటివారు ప్రశ్నించారు. దీనికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా.. బీసీలు.. ముఖ్యంగా హిందువులు నష్టపోతారని సంజయ్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ఓబీసీలను ముఖ్యమంత్రులను, ప్రధానులను చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం మోసం చేస్తుందని కమలం నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్.. ప్రధాని కుల ప్రస్తావన తీసుకొచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. మోదీది పుట్టుకతో ఉన్నత కులం. కానీ 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకున్నారు అని’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 14న శుక్రవారం నాడు రేవంత్ ఈ కామెంట్స్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. రాహుల్ గాంధీ కులం ఏంటని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ కులగణనపై తాము ప్రశ్నిస్తుంటే.. మోదీ కుల ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. ఇదే అంశంపై రెండ్రోజులుగా బీజేపీ నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయం అంతా కులాల చుట్టూ తిరుగుతోంది.ప్రధాని నరేంద్ర మోదీ.. 1950 సెప్టెంబరు 17న గుజరాత్‌లోని వాద్ నగర్ ప్రాంతంలో జన్మించారు. మోద్ ఘాంచి అనే కులంలో మోదీ పుట్టారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోదీ పుట్టినప్పుడు ఆయన కులం జనరల్ (ఓసీ) జాబితాలోనే ఉంది. కానీ.. మండల్ కమిషన్ సిఫారసు మేరకు మోద్ ఘాంచి కులాన్ని గుజరాత్ ప్రభుత్వం ఓబీసీల జాబితాలో చేర్చింది.’మండల్ జాబితా 91(ఎ)లో మోద్ ఘాంచి కులం ఉంది. 1994 జూలై 25న ఓబీసీ కులాల జాబితాలో మోద్ ఘాంచి కులాన్ని చేర్చుతూ.. గుజరాత్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే అంశాన్ని జాతీయ బీసీ కులాల కమిషన్ వెల్లడించింది’ అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘మోద్ ఘాంచి కులాన్ని గుజరాత్‌లో ఓబీసీ జాబితాలో చేర్చే సమయంలో.. నరేంద్ర మోదీ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన సంస్థ కోసం పనిచేసేవారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీనే గుజరాత్‌లో అధికారంలో ఉంది’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.


Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »