జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం
హైదరాబాద్
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీ చెకోపోస్ట్ నుంచి ఫిలింనగర్ వైపు వెళ్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి డివైడరను ఢీకొట్టింది. ఎయిర్బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది. కారు ముందు భాగం ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.