పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య…
భార్య ముందే మరో యువకుడి గొంతు కోసి హత్య చేసిన భర్త
నిర్దేశం, పెద్దపల్లి:
పెద్దపల్లి లో దారుణం జరిగింది. పట్టపగలు వ్యవసాయ మార్కెట్లో అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ ను దొంగతుర్తి గ్రామానికి చెందిన రైలుకుల సంతోష్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. కింద పడిపోయిన వ్యక్తిపై కసితీరా తన్నాడు. ఈ ఘటన హత్యకు పాల్పడ్డ వ్యక్తి భార్య కళ్ళేదుటే జరిగింది. భర్త కత్తితో కుమార్ ను పొడిచి చంపడంతో భార్య సొమ్మసిల్లి పడిపోయింది. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ కుటుంబ కలహాల నేపథ్యంలో మాట్లాడుకుందామని మార్కెట్ యార్డుకు ముగ్గురు చేరుకున్నట్లు సమాచారం. అయితే పథకం ప్రకారం సంతోష్ కుమార్ పై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు. సంఘటన స్థలంలోనే ఉన్న ఉన్న హంతకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య ముందే కుమార్ ను పొడిచి చంపడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. సొమ్మసిల్లి పడిపోయిన సంతోష్ భార్య ను ఆసుపత్రికి తరలించారు.