బీఆర్ఎస్ ఎంపీలు మాతో టచ్ లో ఉన్నారు
-బీజేపీ నేత డా. లక్ష్మణ్
నిర్దేశం, హైదరాబాద్, బీఆర్ఎస్ ఎంపీలు పలువురు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ బాంబు పేల్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తు పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు. కాళ్ల బేరానికి వచ్చినా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమన్నారు.ఆధారాలు లభిస్తే కవిత అరెస్టు తప్పదన్నారు.
బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ కే ఉందన్నారు.