బీజేపీ గెలుపు వెనుక కాంగ్రెస్ ‘హస్తం’

నిర్దేశం, న్యూఢిల్లీ: దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. ఇప్పటికే సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీదే అధికారం. కేంద్రంలో సరేసరి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, బీజేపీ ముందంజలో ఉంటోంది. ఎన్నికల ఫలితాలను సరిగ్గా పరిశీలిస్తే ఒక విషయం బోధపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీ బలపడుతూ వస్తోంది. సరిగ్గా చెప్పాలంటే, కాంగ్రెస్ వల్లే బీజేపీ గెలుస్తుంది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. స్థానిక పార్టీలు ఉన్న చోట బీజేపీ నిలదొక్కుకోవడం లేదు. ఒకటి రెండు చోట్ల తప్పితే బీజేపీ ఎక్కడా లేదు. ఎటొచ్చీ.. కాంగ్రెస్ ఎక్కడుంటే బీజేపీ అక్కడ ఉంటోంది.

కాంగ్రెస్ ఉందంటే బీజేపీ గెలిచినట్లే

కాంగ్రెస్ ఒక చోట ఉందంటే, అక్కడ బీజేపీ గెలిచినట్లేనని ఎన్నికల ఫలితాలు పదే పదే చెప్తున్నాయి. దక్షిణాదిలో ఒక కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. చాలా కాలంగా కర్ణాటకలో ఈ రెండు పార్టీలదే హవా. వాళ్లు పోతే వీళ్లు, వీళ్లు పోతే వాళ్లు అన్నట్లు. అదే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ కనుచూపు మేరలో కూడా కనిపించదు. కారణం, ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూడా అనుకున్నంత బలంగా లేదు. ఈమధ్య తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బహుశా.. అది బీజేపీ బలోపేతానికి దారి తీయొచ్చు. విపక్షంగా కాంగ్రెస్ ఉందంటే.. బీజేపీకి పండగే అయిపోయింది. కాషాయ నేతలు తాపీగా తడిగుడ్డుసుకుని పడుకుంటారు.

అత్యంత ఫెయిల్యూర్ ప్రతిపక్షం కాంగ్రెస్

భారత రాజకీయ చరిత్రలో అత్యంత ఫెయిల్యూర్ ప్రతిపక్షం ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పవచ్చు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం తర్వాత దేశంలో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ, బీజేపీ వరుసగా మూడవసారి సొంత బలంతో ఏర్పాటు చేసింది. (మూడోసారి కూడా 240 సీట్లు అంటే చాలా ఎక్కువ). అలాగే నెహ్రూ తర్వాత వరుసగా ఇంత వరకు మూడుసార్లు ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, మూడుసార్లు ఒక వ్యక్తి ప్రధానిగా ప్రమాణం చేయలేదు. నెహ్రూ టైంలో పరిస్థితులు వేరు. అప్పుడు కాంగ్రెస్ తప్ప ఈ దేశంలో ప్రజలకు మరో పార్టీ పేరు తెలియదు. కానీ, నేడు ఇంత టెక్నాలజీ, ఇంత అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ మూడు సార్లు గెలిచిందంటే.. విపక్షంలో కాంగ్రెస్ ఉండడం వల్లే.

రాహుల్ గాంధీ బంగారు బాతు

రాహుల్ గాంధీ ఓ బంగారు బాతు. అయితే ఈ బంగారు బాతు తన బంగారు గుడ్లను కాంగ్రెస్ కు ఇవ్వకుండా, బీజేపీకి ఇస్తోంది. ఒక రకంగా చెప్పలంటే, కాంగ్రెస్ సంస్థాగతంగా ఇప్పటికీ బీజేపీ కంటే ఎక్కువ బలంగా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీనే ఆ పార్టీకి పెద్ద మైనస్. జననాయకుడని కాంగ్రెస్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత చేసినా, ప్రజల్లో ఆ నమ్మకం కలగడం లేదు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ కూటమి అయినా ఎన్నికల్లో వెనుకంజలో ఉండడానికి ఇదే ప్రధాన కారణం.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!