నిర్దేశం, న్యూఢిల్లీ: ‘ఆశ్రం’ అనే వెబ్ సిరీస్ చూసే ఉంటారు. బాబీ డియోల్ ప్రధాన పాత్ర పోషించిన ఆ సినిమాలో బాబాలు బయట ఎలా ఉంటాడు, లోపల ఏం జరుగుతుందనే విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. సచ్చా డేరా బాబా, నిత్యానంద లాంటి ఉదహారణలు నిజజీవితంలో కనిపించేవే. ఇక ప్రస్తుతం ట్రెండులో ఉన్న భోలే బాబా తక్కువేం కాదు. సత్సంగలో బాబా చుట్టూ కేవలం కన్య బాలికలు మాత్రమే ఉంటారట. పెళ్లైన స్త్రీలని ఆ లోపలికే రానివ్వరని తాజా ఇన్వెస్టిగేషన్ లో తేలింది.
కన్య బాలికలు మాత్రమే బాబా శిష్యులు
బాబా సత్సంగంలో ఆయనకు సమీపంలో ఉండే యువతులు ఎర్రటి రంగు దుస్తులు ధరిస్తారు, ఎప్పుడూ నల్ల కళ్లద్దాలు పెట్టుకుంటారని వారిని చూసినవాళ్లు చెప్పారు. నిజానికి వారు బయటికి పెద్దగా కనిపించరు. బాబాకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమట, బాబా సత్సంగంలో కన్య బాలికలు నృత్యం చేస్తారు. డ్యాన్స్ తర్వాత అమ్మాయిలు బట్టలు మార్చుకునేవారని ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ తెలిపారు. ఆయన స్నానానికి నీళ్లు పెట్టే దగ్గరి నుంచి భోజనం పెట్టే వరకు ఆ యువతులే చూసుకుంటారట.
కన్య బాలికలకు బాబా భర్త
పెళ్లికాని అమ్మాయిలు ఆ బాబాను భర్తగా భావించేవారట, వారితో అతడు అనుచిత కార్యకలాపాలు చేస్తాడట. ఈ విషయాన్ని వెల్లడించే సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ సిగ్గుతో ముఖం తిప్పుకుంది. ఆయన ఒక్క మాట చెప్తే ఆ అమ్మాయిలు ఏం చేయడానికి సిద్ధంగా ఉంటారట. ఆశ్రమంలో వివిధ వర్గాల స్త్రీలు ఉన్నారని బాబా అనుచరుడు చెప్పాడు. అయితే బాబాకు అత్యంత సమీపంలో కన్య అమ్మాయిలు మాత్రమే ఉంటారు. వారిని అతడు శిష్యులుగా చెప్తుంటాడు. ఆయన శిష్యురాలు కావడానికి ప్రత్యేక దీక్ష తీసుకుంటారట. అయితే వివాహిత స్త్రీలు భోలే బాబా దర్శనం పొందగలరు. కానీ, వారిని దూరం ఉంచి ఆశీర్వదిస్తారట.
కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి బాబాపై, ఆయన సేవకులపై పోలీసులు పట్టు బిగిస్తున్నారు. పోలీసులు ఇప్పటి వరకు అనేక మంది బాబా అనుచరులను అరెస్టు చేశారు. రోజు రోజుకు భోలే బాబా అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.