ఉత్తమ జర్నలిస్ట్ గా సాతేపూతే శ్రీనివాస్
నిర్దేశం, నిజామాబాద్ :
కుళ్లిన సమాజానికి శస్త్ర చికిత్స చేయడానికి ముందుంటారని అన్నారు ఆర్మూర్ కోర్టు సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్ట్ గా ఎంపికైన సాతేపూతే శ్రీనివాస్ ను సన్మానించారు. తెలంగాణ కేసరి దినపత్రికలో రాసిన వార్తల ద్వారా అవినీతిని బహిర్గతం చేసిన శ్రీనివాస్ ను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కు అవార్డుతో పాటు క్యాష్ పురస్కారాన్ని అంద చేశారు.