‘‘బ్యాక్ డోర్..’’ మూవీ ఈ సమాజాన్ని తట్టిలేపే మెసేజ్ ఇస్తుంది..

‘‘బ్యాక్ డోర్..’’ మూవీ..

సమాజాన్ని తట్టిలేపే మెసేజ్ ఇచ్చే సినిమా..

వివాహేతర సంబంధాలకు కారణం చూపే సినిమా..

బ్యాక్ డోర్.. అంటే ఇదో సినిమా.. సోషల్ మీడియాలో కొట్టుకుపోతున్న సమాజాన్ని తట్టిలేపే మెసేజ్ ఇచ్చే సినిమా.. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్న వివాహేతర సంబంధాలపై కొరడా ఝళిపించిన సినిమా.. ఉరుకుల పరుగుల జీవితాలతో భార్య – భర్తల మధ్య ఏర్పాడే విభేదాలకు కారణం..? చూయించేది ఈ ‘బ్యాక్ డోర్’ సినిమా..

ఈ ‘బ్యాక్ డోర్’ పేరులోనే అర్థం ఉంది. పెళ్లైన తరువాత తన భర్త బిజినెస్ – డబ్బుల కోసం పరుగులు పెడుతుంటే పరిచయమైన మరో మగాడితో చాటింగ్.. వీడియోలో టాకింగ్.. ఆ పరిచయం ఒంటరిగా కలువాలని వారి ఆలోచన.. అలా కలువడమే ఈ ‘బ్యాక్ డోర్’ సినిమా..

పొద్దున లేసిన నుంచి భర్త డ్యూటీకి వెళ్లడానికి, ఇద్దరు పిల్లలు స్కూల్ కు వెళ్లడానికి యంత్రంలా పడుతున్న మహిళ బాధలతో ప్రారంభమయ్యే ఈ ‘బ్యాక్ డోర్’ సినిమా ప్రతి క్షణం ఆలోచింప చేస్తోంది. డబ్బు సంపాదనలో భర్త తనకు టైమ్ ఇవ్వక పోవడం వల్ల పెళ్లిలో అరుణ్ (తేజ త్రిపురణ) తో పరిచయం పెంచుకున్న అంజలీ (పూర్ణ) ఇద్దరి మధ్య సంభాషణలు మనలను ఎక్కడికో తీసుకెళుతాయి. తాను కూడా అందమైన యువతిని ఆకర్శించడానికి పడిన తీపి – చేదు జ్ఞాపకాలు సినిమా రీలులా మగాళ్లకు గుర్తుకొస్తాయి. నా దృష్టిలో మెజార్జీ మగాళ్లు పరాయి యువతి సెక్స్ కోసం చేసే కుట్రలను బాగా వర్ణించారు. ఒక అమ్మాయి (లొంగ దీసుకోవడానికి) తో సెక్స్ సంబంధాలు పెట్టుకోవడానికి అరుణ్ అనే మగాడు మాయ మాటలు.. ఆ మాటలకు దీటుగా సమాధానం చెప్పే అంజలి అనే మహిళ. సినిమాంత వీళ్లిద్దరి మధ్యనే నడుస్తోంది.

సెక్సీగా కనిపించే అంజలి.. హీరోలా కనిపించే అరుణ్ ఇద్దరి మధ్య సెక్స్ డైలాగ్స్ … సస్పెన్స్.. థ్రిల్లింగ్ తో కొనసాగే ‘బ్యాక్ డోర్’ సినిమా బోర్ రాదు.. అప్పుడే సినిమా అయిపోయిందా అనిపిస్తుంది.

నా మాటలు నమ్మడం లేదా.. అయితే.. యూ ట్యూబులో ఇగో.. ఈ లింక్ https://youtu.be/6rKBCqZJAOE?si=5S3lf1hHq1WCPbuv క్లిక్ చేస్తే మీరే ‘బ్యాక్ డోర్’ సినిమా చూడచ్చు.. ఈ సినిమా కథలో మనం ఊహించని డైలాగ్స్ ఉన్నాయి. పరాయి మగాడితో సెక్స్ తప్పు కాదనే సుప్రీం కోర్టు డైలాగ్ తో అరుణ్ తన లేడి ఫ్రెండ్ అంజలిని ఒప్పించడానికి యత్నం.. ఆ తీర్పులోనే భర్త అనుమతి లేకుండా సెక్స్ పెట్టుకోవద్దని చెప్పిన విషయం గుర్తు చేస్తుంది అంజలి. అయినా.. కోర్టు చెప్పడం కాదు.. మనస్సాక్షి ముఖ్యం అంటుంది ఆమె. ఒక్కో డైలాగ్ వింటుంటే ఇద్దరితో తీసిన సినిమాలో మెసేజ్ సూపర్ అనాల్సిందే. మగాళ్లకు ఉన్న స్వేచ్ఛ.. ఆడవాళ్లకు ఉన్న సాంఘీక కట్టుబాట్లు ఇలా ఒక్కటి.. రెండు కాదు. ప్రతి క్షణం ఇద్దరి మధ్య డైలాగ్ లే..

‘‘భర్త ఉండగా నిన్ను ఇంటికి పిలిసిన నన్ను.. వేరోకరికి భార్యనైన నాకోసం వచ్చిన నిన్ను ఈ సమాజం ఏమంటుంది.’’ అని నిలదీస్తుంది అరుణ.

సినిమా విశ్రాంతి సమయంలో మెట్లపై నుంచి హీరో అరుణ్ నేలపై పడి రక్తం కారుతూ స్పృహ లేకుండా పడి పోవడంతో సినిమా చూసే ప్రతి ఒక్కరిలో టెన్షన్.. ఇంట్లోకి వచ్చిన ప్రియుడు ప్రమాదవశాత్తు మరణించాడు.. ఇప్పుడు పచ్చని ఆ సంసారంలో ‘చావు’ చిచ్చుతో ఏమైతుందానేది కొంత సేపు సస్పెన్స్.. ఊపిరి బిగ పట్టుకుని ఇంకేమి జరుగుతుందని సినిమా చూస్తుంటాం. మధ్య మధ్యలో అంజలి – అరుణ్ సెక్స్ తో ఒక్కటైతారనిపించే సమయంలో భర్త కాల్..

‘ఒక అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలుసా..? నీవు అందంగా కనిపిస్తున్నావ్.. అని భర్త గిఫ్ట్ ఇస్తే హ్యపీగా ఉంటుంది.’ అని చెబుతుంది అంజలి.

‘నా భర్తతో ఉంటెనే నాకు ఈ సమాజంలో వ్యాల్యు ఉంటుంది. ఆనందం ఉంటుంది.’ అని సినిమా చివరలో డైలాగ్.. ఇంతకు వారి మధ్య సెక్స్ డైలాగ్ లతో పాటు బ్యాక్ రౌండ్ పాటలు… డ్యాన్స్ లు ఉంటాయి. ఈ సినిమా చూస్తే ఆడ – మగ తేడా లేకుండా ఆలోచిస్తాం… మంచి మెసేజ్ సినిమా..

సినిమా ముగియడానికి ముందు తెరపై కనిపించే అక్షరాలు..

‘‘ఈ దేశంలో అతి పెద్ద సమస్య వివాహేతర సంబంధాలు.. క్షణిక సుఖం కోసం భర్తను భార్య.. భార్యను భర్త మోసం చేసుకుంటూ సంసారం సర్వనాశనం చేసుకుంటున్నారు. శారీరక సుఖం కోసం వెంపర్లాడుతూ  రక్తం పంచుక పుట్టిన సంతానాన్ని అనాధలుగా చేస్తున్నారు. అందుకే అనాధ పిల్లల సంఖ్య పెరిగి పోతుంది. స్త్రీ – పురుషుల మధ్య కామం హత్యలకు దారి తీస్తోంది. ఇక నుంచైన దేశ సంస్కృతి.. మెరుగైన సమాజం కోసం ప్రయత్నాం చేద్దాం..’’ ఫైనల్ గా ఈ ముచ్చట..

‘బ్యాక్ డోర్’ సినిమా రచయిత అండ్ సిని డైరెక్టర్ కర్రి బాలాజీ గారి దర్శకత్వంలో సినిమాటోగ్రాఫీ.. కెమోరామెన్ విజ్యువల్స్.. నటి నటులు పూర్ణ, తేజ త్రిపురలు డైలాగ్ కు తగ్గట్లుగా సెక్సిగా కనిపించడం సూపర్..  ఈ చిత్ర నిర్మాత బి. శ్రీనివాస్ రెడ్డి..

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!