Antony Keerthi Suresh Marriage: రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ‘నేను శైలజ’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కీర్తి సురేష్. తెలుగులో చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని వంటి టాప్ స్టార్స్ అందరితోనూ యాక్ట్ చేసింది ఈ బ్యూటీ.
ఇండియాలో అన్నీ భాషల్లోనూ చాలా సినిమాలు చేసింది, జాతీయ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది ఈ బ్యూటీ. అయితే ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు కీర్తి సురేష్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… వచ్చే నెల డిసెంబర్ 11,12 తేదీల్లో గోవాలో తన వివాహం ఆంటోనీ తట్టిల్ తో జరగనుందని చెప్పుకొచ్చింది.
మొన్న దీపావళి రోజున ఇన్‌స్టాగ్రామ్ లో ఆంటోనీ తట్టిల్ ఫోటోని షేర్ చేస్తూ.. తమ బంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయంటూ తన ప్రేమను కన్ఫమ్ చేసింది. ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయినా తమ లవ్ ని వీళ్లు ఇప్పుడు పెళ్లి పీటల మీదికి తీసుకెళ్తున్నారు. ఈ సందర్బంగా కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బట్టలు విప్పేసి కొట్టుకున్న వ్యాపారులు.. ఈ వీడియో చూడకపోతే మీరు ఇంటర్నెట్ ప్రపంచంలో లేనట్టే