యువతిపై అత్యాచారయత్నం….
ప్రతిఘటించి తప్పించుకున్న యువతి
హైదరాబాద్, నిర్దేశం:
నగరంలో రోజురోజుకూ అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బయటకు వెళ్లిన వారు జాగ్రత్తగా ఇంటికి ఇస్తారా అనే సందేహం తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళలను కలిగిస్తోంది. ఈనేపథ్యంలోనే మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుండగులు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కానీ యువతి మాత్రం భయపడిపోకుండా తనను తాను రక్షించుకునేందుకు కీచకులతో పోరాడిరది. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా వారితో ధైర్యంగా పోరాడిరది. కామాంధుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఒక్కసారిగా దుండగులు మీదకు రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో దాడి చేసి తప్పించునేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ దుండగుల భారి నుంచి ఎలాగోలా తప్పించుకుని వెంటనే మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచాలంటూ పలు డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి.