ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి
నిర్దేశం, హైదరాబాద్ :
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై ఫిలింనగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ పోలీస్టేషన్ పరిధి లోని ఓ కాలనీలో నివాసముంటున్న బాలిక (6) ఒకటో తరగతి చదువుతున్నది. ఇటీవల బాలిక తల్లి శస్త్ర చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. దీంతో బాలికను పెదనాన్న ఇంట్లో ఉంచారు. రెండ్రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లి ఇంటికి వచ్చింది. బాలిక తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న విషయాన్ని గమ నించి ప్రశ్నించగా, పెదనాన్న కొడుకు(20) తనకు చాక్లెట్ ఇచ్చి.. లైంగికదాడికి పాల్పడ్డాడని చెప్పింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.