మానవత్వం చాటుకున్న అంకం జ్యోతి ఫౌండేషన్
నిర్దేశం, నిజామాబాద్:
సేవ చేయడానికి పదవులు అవసరం లేదని నిరూపిస్తున్నారు భీంగల్ మండలానికి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్. చలి కాలంలో రోడ్ లపై వణుకుతున్ననిరుపేదలకు కొత్త బట్టలు ఇచ్చి ఆదుకున్నారు ఆ సంస్థ డైరెక్టర్ అంకం జ్యోతి, ఆమె భర్త సంతోష్ కుమార్. అలాగే అనాధ ఆశ్రమంలో నివసించే చిన్నారులకు డ్రెస్సులు ఇచ్చారు. అంతే కాకుండా మానసికంగా బాధపడుతున్న అబ్బాయిలకు కొత్త బట్టలు పంపిణీ చేసారు. రోడ్డు పైన ఉండే అనాధ వృద్దులకు అన్నదానం చేసింది అంకం జ్యోతి ఫౌండేషన్.