బాధిత కుటుంబాలకు ఓదార్పు….అండగా ఉంటామన్న అమిత్‌ షా

బాధిత కుటుంబాలకు ఓదార్పు….అండగా ఉంటామన్న అమిత్‌ షా

కాశ్మీర్‌ వివాదాన్ని అంతర్జాతీయం చేసే కుట్ర
వాన్స్‌ పర్యటనలో ఉండగా ఉగ్రదాడి
క్లింటన్‌ పర్యటన సమయంలోనూ ఇదే తరహా ఘటన

నిర్దేశం, శ్రీనగర్‌:

పహల్గామ్‌ బాధిత కుటుంబాలతో శ్రీనగర్‌లో కేంద్ర మంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. అంతకముందు పహల్గామ్‌ మృతుల భౌతికకాయాలకు అమిత్‌ షా నివాళులర్పించారు. అమిత్‌ షా.. పహల్గామ్‌ సంఘటనాస్థలిలో పర్యటించారు. అమిత్‌ షా వెంట జమ్మూకశ్మీర్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఉన్నారు. ఇక భద్రతా దళాలు ఆ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా గుర్తించారు. వీరిలో 5-7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు- సమాచారం. దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌(టీ-ఆర్‌ఎఫ్‌) ప్రకటించింది. ఈ ఉగ్రవాదులంతా కేవలం పురుషులను మాత్రమే టార్గెట్‌ చేసుకున్నారు. మహిళలు, పిల్లల్ని ఏమి చేయలేదు. వారి జోలికి కూడా రాలేదు. ఒకవేళ అడ్డొచ్చినా.. ఏవిూ చేయలేదు. ఇక ముస్లిమా? కాదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నాకే కాల్చారు. ఐడీ కార్డులో పేరు చూసి మరీ కాల్చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది మరణించారు. యూఏఈ, నేపాల్‌కు చెందిన ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిరచాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్‌ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.

జమ్మూ కాశ్మీర్‌ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేందుకే విదేశీ అతిథుల భారత పర్యటనలో ఉండగానే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో ఉండటం.. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ భారత్‌లో పర్యటన కొనసాగుతున్న సమయంలో పహల్గాం దాడి జరగడం గమనార్హం.
అయితే, ఇలాంటి ఘటన సుమారు పాతికేళ్ల క్రితం జరిగింది. అంటే, 20 మార్చి 2000వ సంవత్సరంలో అనంత్‌నాగ్‌ జిల్లాలో ఛత్తీసింగ్‌పొరలో ఉగ్రవాదులు సుమారు 36 మందిని చంపేశారు. నాడు సిక్కు కమ్యూనిటీలోని వారే ఉగ్రవాదులకు టార్గెట్‌ అయ్యారు. వాస్తవానికి అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూ ఢల్లీి పర్యటనలో ఉండగా.. అప్పుడు జమ్మూకశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్‌యంతోనే పాకిస్థాన్‌ ఈ దాడికి పాల్పడినట్లు- అందరు భావించారు. కాగా, నాడు ఉగ్రమూకలు భారీ తుపాకులు, రెండు సైనిక వాహనాల్లో ఛత్తీసింగ్‌పొర గ్రామంలోకి చొరబడి.. ఇంటింటికీ తిరిగి తమను సైనిక సిబ్బందిగా చెప్పుకొని.. తనిఖీల నిమిత్తం పురుషులు అందరు బయటకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.. ఆ తర్వాత వారందరినీ గురుద్వారా దగ్గర ఉంచి కాల్చి చంపేశారు. దీంతో భారత సైన్యమే ఆ పని చేసిందన్నట్లు- అక్కడిని వారిని ఈ ఉగ్రవాదులు నమ్మించేలా నినాదాలు కూడా చేశారు. కానీ, చివరికి దర్యాప్తు సంస్థలు పాక్‌ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు తేల్చాయి. కాగా, ఇప్పుడు.. పహల్గాంలో ఉగ్ర దాడికి.. గతంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుటు-ంబంతో కలిసి పర్యటిస్తున్నారు. మరోవైపు భారత ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఇదే సరైన సమయంగా భావించిన ఉగ్రవాదులు ఇండియన్‌ ఆర్మీ దుస్తుల్లో వెళ్లి పహల్గామ్‌కు వచ్చిన పర్యటకుల మతంతో పాటు ఐడీలను పరిశీలించి మరీ దాడి చేశారు. హిందువులనే టార్గెట్‌ గా చేసుకుని చంపేయడం గమనార్హం.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »