ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికన్లు నిరసన..

ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికన్లు నిరసన.. 

వాషింగ్టన్ డీసీ, నిర్దేశం:

వాషింగ్టన్ డీసీలో రోడ్లపైకి వేలాదిగా జనం మొత్తం 50 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అమెరికన్లు
ట్రంప్ నిర్ణయాలతో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలిపాయి. ముందుచూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు
.

ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయంపైనా నిరసన వ్యక్తం చేశారు. ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో దేశవ్యాప్తంగా 1,200 పైగా ప్రదేశాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘ట్రంప్ గో బ్యాక్’, ‘హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ’, ‘మస్క్ వాస్ నాట్ ఎలెక్టెడ్’ వంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామీ వంటి నగరాల్లోని స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, టారిఫ్ ల విధింపు, మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ప్రజలు తమ ఆందోళనలను కేంద్రీకరించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »