ఇండియన్ క్రికెటర్లు, సినిమా హీరోయిన్లతో డేటింగ్ చేసి పెళ్లి పీటలు దాకా తీసుకపోవడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా ఇప్పటికే మనం ఎన్నో జంటల్ని చూసాం. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, కేఎల్ రాహుల్ ఇంకా ఎంతోమంది హీరోయిన్స్‌తో డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నవారే. అయితే.. ప్రస్తుతం టీమిండియాలో యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తనే సంకేతాలిచ్చాడు.
ప్రముఖ హీరోయిన్ ‘ప్రగ్యా జైస్వాల్’ ఒక ఇంటర్వ్యూలో క్రికెటర్‌తో డేటింగ్ చేస్తారా? చేయాలనుకుంటే ఎవరితో అని ప్రశ్నించగా.. ఆమె వెంటనే యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్‌తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది. గిల్ అంటే తనకెంతో ఇష్టమని అంది. అయితే ఈమె చేసిన ఈకామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె ఇంస్టాగ్రామ్ లోని కొన్ని ఫొటోస్ తీసుకొని అభిమానులు ఇలా షేర్ చేస్తున్నారు.. . ‘ప్రగ్యా ‘ సింగిల్ ఇపుడు.. గిల్తో మింగిల్ అవ్వడానికి రెడీ ..